Tamil Actress Dupes NRI Man Of 41 Lacsc మాయలాడి నటి.. పెళ్లి పరుతో ఎన్నారైని వంచించింది..

Tamil actress tricks nri man with marriage proposal dupes him of 41 lacs

Shruthi P​, Shruthi, Kollywood, Germany, Balamurugan, aadi pona aavani, tamil actress, nri, wedding

police in Coimbatore has arrested Tamil actress, Shruthi P for duping a Germany based NRI man for 41 lacs!

మాయలాడి నటి.. పెళ్లి పేరుతో ఎన్నారైని వంచించింది..

Posted: 01/12/2018 08:35 PM IST
Tamil actress tricks nri man with marriage proposal dupes him of 41 lacs

ఓ ఎన్నారైను పెళ్లి చేసుకుంటానని చెప్పి చెన్నయ్ కు చెందిన తమిళ వర్థమాన సినీ నటి శ్రుతి మోసానికి పాల్పడింది. అతని వద్ద నుంచి రూ.41 లక్షలు లాక్కుంది. ఈ సంఘటన నేపథ్యంలో శ్రుతిని, ఆమె తల్లి, సోదరుడుతో పాటు శ్రుతికి తండ్రిగా నటించిన వ్యక్తిని నిన్న అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సేలంకు చెందిన వ్యక్తి జి.బాలమరుగన్, జర్మనీలో ఓ ఆటోమొబైల్ కంపెనీలో పనిచేస్తున్నాడు.

అతను అవివాహితుడు. 2017 మేలో అతను తన ప్రొఫైల్ ను మ్యాట్రిమోనియల్ వెబ్ సైట్ లో ఉంచాడు. ఇదే వెబ్ సైట్ ద్వారా శ్రుతికి, అతనికి పరిచయమైంది. తన పేరును మైథిలీ వెంకటేశ్ గా అతనికి పరిచయం చేసుకున్న శ్రుతి, అతన్ని పెళ్లి చేసుకుంటానని నమ్మించింది. ఈ క్రమంలో తన కుటుంబసభ్యుల ఫొటోలను అతనికి పంపింది. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత, తన ఆరోగ్యం బాగాలేదని, బ్రెయిన్ ట్యూమర్ ఉందని, తనకు శస్త్రచికిత్స చేయాలని వైద్యులు పేర్కోన్నట్లు చెప్పింది.

ఆ తరువాత తన తల్లి ఆరోగ్యం కూడా బాగుండలేదని, ఆమెకు గుండె ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉందని బాలమురుగన్ ని నమ్మించింది. ఈ మాటలు నిజమని నమ్మిన బాలమురుగన్ పలు వాయిదాల్లో మొత్తం రూ.41 లక్షల వరకు ఆమెకు పంపించాడు. 2017 మే నుంచి ఈ ఏడాది జనవరి 1 లోపు ఈ మొత్తం ఆమెకు పంపించాడు. అయితే, శ్రుతి ఫొటోలను, ఆమె కుటుంబ సభ్యుల ఫొటోలను బాలమురుగన్ తన బంధువులకు, స్నేహితులకు చూపించడంతో అసలు విషయం వెలుగు చూసింది. ఈ నేపథ్యంలో పోలీసులకు బాలమురుగన్ ఫిర్యాదు చేయడంతో నిందితులను అరెస్టు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shruthi P​  Shruthi  Kollywood  Germany  Balamurugan  aadi pona aavani  tamil actress  nri  wedding  

Other Articles