CBI court sentences Lalu in Fodder Scam | దాణా కుంభకోణం.. మూడున్నరేళ్లు లాలూ జైల్లోనే...

Lalu prasad yadav sentenced jail

Fodder Scam, Lalu Prasad Yadav, Ranchi, CBI Special Court, Fodder Scam Lalu Convicts, Lalu Jail Term

Bihar Former CM, RJD Chief Lalu Prasad Yadav sentenced to jail for 3.5 years, fined Rs 5 lakh in Fodder Scam.

ఎట్టకేలకు లాలూకు శిక్షలు ఖరారు

Posted: 01/06/2018 04:46 PM IST
Lalu prasad yadav sentenced jail

దాదాపు 21 ఏళ్ల పాటు సుదీర్ఘంగా కొన‌సాగిన దాణా కుంభకోణం కేసులో దోషుల‌కు ఈ రోజు శిక్ష ఖ‌రారు అయింది.జార్ఖండ్‌లోని రాంచీ సీబీఐ ప్ర‌త్యేక కోర్టు జ‌డ్డి ఈ రోజు వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా వీరికి శిక్ష‌ను ఖ‌రారు చేశారు. లాలూ ప్ర‌సాద్ యాద‌వ్‌కి మూడున్నరేళ్ల జైలు శిక్షతో పాటు ఐదు లక్షల జరిమానా విధిస్తున్నట్లు జడ్జి తీర్పు వెల్లడించారు. మిగతా దోషులకు కూడా ఇదే శిక్షను విధించారు.

బీహార్ మాజీ ముఖ్య‌మంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ స‌హా 15 మందిని రాంచీలోని సీబీఐ కోర్టు ఇటీవల దోషులుగా తేల్చిన విష‌యం తెలిసిందే. అప్పటి నుంచీ దోషులంద‌రూ జైలులో ఉన్నారు. కాగా,  ఇక తీర్పుపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు లాలూ తనయుడు, ఆర్జేడీ నేత తజస్వి యాదవ్ పేరొన్నారు.

మరోవైపు లాలూ శిక్షపై జేడీయూ నేత కేసీ త్యాగి హర్షం వ్యక్తం చేశారు. బిహార్ రాజకీయ చరిత్రలోనే ఇదో మైలురాయి అని.. అవినీతి రాజకీయాలకు న్యాయవ్యవస్థ చరమగీతం పాడిందని ఆయన పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles