metro pillar collapsed, fake new viral in social media మెట్రో పిల్లర్ ను ఢీకొన్న ట్రక్కు.. కూలిపోయిందంటూ వార్తలు

Metro pillar collapsed in bengaluru fake new viral in social media

BMRCL, metro, pier portal, Mysuru Road, traffic, soical media, viral news, truck hits metro pillar, nayandahalli, bengaluru

A concrete beam and other construction material fell from an under-construction metro pier on Mysuru Road after a truck hit part of the pier

మెట్రో పిల్లర్ ను ఢీకొన్న ట్రక్కు.. కూలిపోయిందంటూ వార్తలు

Posted: 01/05/2018 09:47 AM IST
Metro pillar collapsed in bengaluru fake new viral in social media

సోషల్ మీడియా పుణ్యమా అని క్షణాల్లో ఏదైనా వార్త సంచలనంగా మారిపోతుంది. అయితే ఇందులో సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడేవి కొన్ని అయితే.. కేవలం సంచలనంగా మారడానికి చేసే ప్రచారాలు అనేకం వుంటున్నాయి. మొన్నీమధ్య సోషల్ మీడియాలో వచ్చిన ఓ పోస్టును చూసి.. ఔరా అనుకుని ముందు వెనుక అలోచించకుండా కేంద్రమంత్రి సుప్రీయో డిసెంబర్ ఫూల్ అవ్వడంతో పాటు.. దానిని అలాగే షేర్ చేయడంతో నెట్ జనుల విమర్శలను కూడా ఎదుర్కోన్నాడు.

సరిగ్గా అలాగే నగరంలో నిర్మితమవుతున్న మెట్రో రైలుకు సంబంధించిన పిల్లర్ కు అప్పుడే పగుళ్లు ఏర్పాడ్డాయని, అది ఏ క్షణంలోనైనా కూలిపోవచ్చునని కూడా హైదరాబాద్ మెట్రోపై సోషల్ మీడియాలో వార్తలు సంచలనంగా మారడంతో స్వయంగా ఐటీ మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగి దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. అలాంటిదేమీ లేదని అవన్నీ వదంతులేనని స్పష్టం చేశారు. అయినా నెట్ జనులకు ఇదో సరదా. అయితే సరదా నవ్వించేట్టు వుండాలి తప్ప నవ్వులపాలు అయ్యేట్లు.. లేదా అందోళనకు గురిచేసేట్లు మాత్రం ఉండరాదు.

తాజాగా బెంగళూరులో మెట్రో పిల్లర్ కూలిపోయిందంటూ వదంతులు వ్యాపించడంతో బెంగళూరు వాసులు తీవ్ర భయాందోళనలకు లోనయ్యారు. నగరంలోని మైసూర్ రోడ్డులో ఓ పిల్లర్ కూలిపోయిందంటూ సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తాయి. పలు టీవీ చానళ్లు కూడా బ్రేకింగ్ న్యూస్‌తో ఈ విషయాన్ని హోరెత్తించాయి. దీంతో ప్రజలు పోలీసులకు, కంట్రోల్ రూములకు ఫోన్ల మీద ఫోన్లు చేశారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ వార్తలు అబద్ధమని తేల్చారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదని, మెట్రో పిల్లర్‌కు ఎటువంటి నష్టం వాటిల్లలేదని పేర్కొన్నారు.

నగర శివారులోని నయందహళ్లిలో నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లరును ఓ ట్రక్కు ఢీకొట్టింది. దీంతో పిల్లర్‌ కొంత మేర దెబ్బతింది. ట్రక్కు డ్రైవర్ పరారయ్యాడు. అయితే వాస్తవాన్ని తెలుసుకోకుండానే కొందరు సోషల్ మీడియాలో విపరీత ప్రచారం చేశారు. పిల్లర్ కూలిపోయిందని పోస్టులు పెట్టారు. దీంతో క్షణాల్లోనే ఈ వార్త నగరమంతా పాకిపోయింది. దీంతో స్పందించిన పోలీసులు, మెట్రో అధికారులు అవి వదంతులు మాత్రమేనని, నమ్మవద్దని కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles