హైదరాబాద్‌లోని జూబ్లిహిల్స్‌లో ఈ మధ్యాహ్నాం దారుణ ఘటన చోటు చేసుకుంది. పట్టపగలే అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై దోపిడీ జరగడం కలకలం రేపుతోంది.
ముగ్గురు దుండగులు ఓ వ్యక్తిని బెదిరించి ద్విచక్ర వాహనం, పర్సు, రెండు సెల్ఫోన్లను కొట్టేసి పారిపోయారు. బాధితుడు ప్రతిఘటించినప్పటికీ లాభం లేకుండా పోయింది. దుండగులు కత్తితో బెదిరిస్తూ ఈ దోపిడీకి పాల్పడ్డారు. రోడ్డుపై వెళుతోన్న ఇతర వాహనదారులు చూస్తూ నిలబడ్డారే కానీ, ఎవ్వరూ అడ్డుకునేందుకు యత్నించలేదు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాకు చిక్కాయి.
బాధితుడి ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
(And get your daily news straight to your inbox)
Jan 12 | కరోనా మహమ్మారిని నియంత్రించే శక్తి కలిగిన కరోనా వ్యాక్సిన్ తెలంగాణకు చేరకుంది. పుణెలోని సీరం ఇనిస్టిట్యూట్ నుంచి కోవిడ్-19 వ్యాక్సిన్ లతో బయలుదేరిన ప్రత్యేక విమానం నేరుగా తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోని రాజీవ్... Read more
Jan 11 | తెలంగాణ సీఎం కేసీఆర్ సమీప బంధువుల కిడ్నాప్ కేసులో అరెస్టయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు సికింద్రాబాద్ కోర్టులో పరాభవం ఎదురైంది. అమె దాఖలు చేసుకున్న బెయిల్ పిటీషన్ ను న్యాయస్థానం... Read more
Jan 11 | భారత్ లో బర్డ్ ఫ్లూ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రోజుకో రాష్ట్రాలకు రాష్ట్రాలను వ్యాపిస్తూ అందోళనకర పరిస్థితులకు దారితీస్తోంది. బర్డ్ ఫ్లూ కేసులు రోజు రోజుకు పెరుగుతూ ఆందోళన కలిగిస్తోంది. మొదట రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో... Read more
Jan 11 | ఆంధ్రప్రదేశ్ లో వచ్చే నెలలో నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణ రాష్ట్ర ఎన్నికల కమీషన్ నగరా మ్రోగించిన నేపథ్యంలో దీనిని వ్యతిరేకిస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వం.. ఎన్నికలను నిలుపుదల చేయాలని రాష్ట్ర హైకోర్టును... Read more
Jan 11 | వాట్సాప్.. స్మార్ట్ ఫోన్ వున్న పత్రీ ఒక్కరికీ ఇదో అందివచ్చిన అద్భుత సాధనం.. తమ ఫోటోలతో పాటు పలు వీడియోలు, ఇతర సమాచారాన్ని తమ అప్తులు, స్నేహితులు, బంధువులతో పంచుకునేలా దోహదపడుతోంది. అయితే తాజాగా... Read more