Criticism on World Chess Championship's Logo | చెస్ కోసం లోగో.. కామసూత్ర భంగిమ అంటూ విమర్శలు

Chess logo kama sutra angel

World Chess Championship, London, Logo, Kama Sutra, Pawnographic, World Chess Federation,

World Chess Championship's 'Kama Sutra' logo criticised. The image, which shows intertwined human-shaped figures holding a chess board, has even been labelled as "borderline pawnographic". According to World Chess, the commercial arm of the World Chess Federation, the visual is "controversial and trendy, just like the host city", London.

చెస్ కోసం కామసూత్ర భంగిమ?

Posted: 12/22/2017 08:57 AM IST
Chess logo kama sutra angel

ప్రపంచ చెస్ చాంపియన్ షిప్-2018 కోసం విడుదల చేసిన లోగోపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హుందాగా ఉండాల్సిన లోగోను కామసూత్ర భంగిమ తరహాలో రూపొందించటం వివాదాస్పదమైంది. 

లండన్‌లో జరగనున్న ఆటల కోసం ఫిడే దీనిని రూపొందించేందుకు మాస్కోకు చెందిన శుఖ డిజైన్ సంస్థకు అప్పగించింది. ఏడాది పాటు శ్రమించి డిజైన్ చేసిన ఈ లోగోను ఆవిష్కరించినందుకు ఆనందంగా ఉందని శుఖ డిజైన్ సంస్థ పేర్కొంది. ఎంతో శ్రమించి అద్భుతమైన ఓ దృశ్య రూపాన్ని తీసుకొచ్చినట్టు ఫిడె చెస్ చాంపియన్ షిప్ నిర్వాహక ప్రతినిధి ఒకరు తెలిపారు. దీనిని బహిరంగ ప్రదేశాలు, ప్రసారమాధ్యమాలతోపాటు పోస్టర్లు, మగ్గులపైనా ఈ లోగోను ముద్రించనున్నట్టు పేర్కొన్నారు.

ఇద్దరు వ్యక్తులు మధ్యలో చెస్ బోర్డు పెట్టుకుని చదరంగం ఆడుతున్నట్టు ఈ లోగోను డిజైన్ చేశారు. చూస్తేనే ఒక రకమైన భావన కలిగేలా ఉన్న ఈ లోగోపై నెటిజన్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకుమించి డిజైన్ దొరకలేదా? అని ప్రశ్నిస్తున్నారు. చెస్ దిగ్గజాలు ఈ లోగోపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఫిడే తీరును తప్పుబడుతున్నారు. దీనికి తోడు కేవలం ఆరు X ఆరు గళ్లనే ముద్రించారని క్రీడాకారులు మండిపడుతున్నారు. మొత్తానికి చెస్‌ను రాత్రిళ్లు మాత్రమే చూసే షోగా మార్చేశారని ఇండియన్ చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles