Special CBI court awards jail term to Madhu Koda ‘మసి’కోడాకు మూడేళ్ల జైలు.. జరిమానా..

Former jharkhand cm madhu koda awarded three years jail term

Madhu Koda, coal scam, CBI special court, Jharkhand, Vini Iron, Steel Udyog, corruption, jail term Jharkhand coal secretary, H.C. Gupta, chief secretary Ashok Kumar Basu, Vijay Joshi

Former Jharkhand Chief Minister Madhu Koda and ex-coal secretary H.C. Gupta were sentenced to three years imprisonment by a special court here in a case of coal block allocation scam

‘మసి’కోడాకు మూడేళ్ల కఠిన కారాగారవాసం.. జరిమానా..

Posted: 12/16/2017 01:45 PM IST
Former jharkhand cm madhu koda awarded three years jail term

బొగ్గు కుంభకోణం కేసులో గనుల అక్రమ కేటాయింపులకు పాల్పడి మసి అంటుకుని దోషిగా తేలిన జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధు కోడాకు న్యాయన్థానం ఇవాళ శిక్షను వెలువరించింది. ఢిల్లీలోని ప్రత్యేక సీబిఐ కోర్టు ఇవాళ తీర్పును వెలువరిస్తూ.. మధుకోడాకు మూడేళ్ల కఠిన కారగారవాసం విధించాలని తీర్పును వెలువరించింది. దీంతో పాటు అక్రమ కేటాయింపుల నేపథ్యంలో ఆయనకు రూ.25 లక్షల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది.

ఈ కేసులో మధుకోడాతో పాటు కేంద్ర బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి హెచ్ సి గుప్తాకు కూడా మూడేళ్ల జైలు శిక్షను విధించిన న్యాయస్థానం అతనికి కూడా లక్ష రూపాయల జరిమానా విధించింది. వీరితో పాటు అప్పటి జార్ఖండ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎకె బసుకి మూడేళ్ల జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధించింది. కాగా ఈ కేసులో కోల్ కతాకు చెందిన విజయ్ జోషితో పాటు ఆయనకు చెందిన సంస్థలు వినీ ఐరన్ అండ్ స్టీల్ ఉద్యోగ్ లిమిటెడ్ (విసుల్) కు జరిమానా విధించింది.

విజయ్ జోషికి కూడా మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.25 లక్షల జరిమానా.. ఇక స్టీల్ ఉద్యోగ్ సంస్థకు రూ.50 లక్షల జరిమానా విధిస్తున్నట్టు ప్రత్యేక న్యాయస్థానం తీర్పునిచ్చింది. వీరు ఈ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టుకు వెళ్లడానికి రెండు నెలల తాత్కాలిక బెయిల్ ను న్యాయస్థానం మంజూరు చేసింది. బొగ్గు కుంభకోణంకు సంబంధించి మొత్తం 30 కేసులు నమోదు కాగా, అందులో నాలుగు కేసుల్లో తీర్పు వచ్చింది.

కాగా, జార్ఖండ్ లోని ఉత్తర రాజ్ హరా బొగ్గు క్షేత్రాన్ని తమకు కేటాయించాలని 2007 జనవరి 8న విసుల్ సంస్థ దరఖాస్తు చేసుకుంది. ఆ సంస్థకు బొగ్గు క్షేత్రం కేటాయించాలని జార్ఖండ్ ప్రభుత్వం గానీ, ఉక్కు మంత్రిత్వ శాఖ గానీ మొదట్లో అనుకోలేదు. కానీ, నాటి బొగ్గు శాఖ కార్యదర్శి గుప్తా ఆధ్వర్యంలోని 36వ ఎంపిక సంఘం మాత్రం అందుకు సిఫార్సు చేసింది. అప్పుడు, బొగ్గు శాఖను నిర్వహిస్తున్న నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ వద్ద వాస్తవాలను దాచిపెట్టి ఈ అనుమతి ఇవ్వడం జరిగింది. ఈ కుంభకోణంలో మధు కోడా, ఎకె బసుతో పాటు ఇతర అధికారులు కుమ్మక్కైనట్టు సీబీఐ అభియోగాలు మోపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles