sudhakar reddy's parents doubt when he refused mutton soup.? బ్రహ్మాణ యువకుడికి మటన్ సూప్.. దొరికిపోయాడు.?

Sudhakar reddy s parents doubt when he refused mutton soup

Sudhakar Reddy, Rajesh, Swathi, illicit affair, mutton soup, Mahbubnagar, Lakshmi Narayana, Apollo Hospitals, murder, arrest, nagar kurnool, telangana, crim

The entire drama behind the woman whi even disfigured her partner’s face with acid to pass him off as her husband was caught as he is a brahmin and refused to take mutton soup.

బ్రాహ్మణుడికి మటన్ సూప్.. రాజేష్ దొరికిపోయాడు..

Posted: 12/12/2017 02:54 PM IST
Sudhakar reddy s parents doubt when he refused mutton soup

బ్రాహ్మణ యువకుడికి మటన్ సూస్ ఇస్తే ఏం చేస్తాడు.. తెలియకపోతే తినేస్తాడు.. తెలిస్తే పడేస్తాడు. అలా కాదు.. అంటే అలవాటు వుంటే లాగించేస్తాడు.. లేకపోతే వాసనను పసిగట్టి వద్దంటాడు. అయితే ఇక్కడ మాత్రం ఈ బ్రహ్మాణ యువకుడు అడ్డంగా దొరికిపోయాడు. అదేంటి ఏం చేశాడు. మటన్ సూప్ లాగిస్తూ దొరికిపోయాడా..? అంటే కాదు.. ఇష్టపడి తినే కొడుకు కోసం ఆ తల్లిదండ్రులు లేద మాంసం తీసుకుని వస్తే.. అతని తల్లే రుచికరంగా వండివార్చేది. దీంతో కడుపునిండా తినే కొడుకు ఇష్టంగా కూడా తినేవాడు.

అలాంటి కొడుకుకు మటన్ సూప్ ఇస్తున్నా వద్దని అంటున్నాడంటే.. దానికి కారణమేంటి..? ఇష్టంగా తినే కొడుకు ఎందుకు వద్దని అంటున్నాడు. మటన్ అనగానే చెవికోసుకునే వాడు.. మటన్ సూప్ మూడు పర్యాయాలు వడ్డించినా వద్దని అంటున్నాడెందుకు..? ఇక్కడే వారికి అనుమానాం వచ్చింది. మీరు కాస్తా కన్ఫూజ్ అయ్యారా..? బ్రహ్మాణ యువకుడి తల్లిదండ్రులు తమ కొడుకు కోసం లేత మాంసం తీసుకురావడమేంటి..? వడ్డించమేంటి..? అతను లాగించడమేంటి..? దొరికిపోవడమేంటి..? అసలు మటన్ సూప్ ఏంటీ..? అంటే..

భర్త అస్తులను ఎంజాయ్ చేయాలి.. కానీ ప్రియుడితో జీవితాంతం సుఖంగా వుండాలని.. అదెలా అంటూ ఎవడు చిత్రాన్ని మించి క్రైం స్టోరికి డ్రామా నడిపించిన స్వాతి.. గుర్తుందిగా.. అమె ఎపిసోడ్ లో ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వచ్చింది. అంతా ముందస్తు పథకం ప్రకారంగా పక్కగా చేసినా.. ఎక్కడో ఓ చిన్న విషయంలో తప్పుచేసి అడ్డంగా దొరికిపోవడం నేరస్థుల సహజ లక్షణం. భర్త హత్య చేయబడ్డాడని అమె చెప్పేవరకు ఎవరూ గుర్తించలేకపోయినా.. స్వాతిని, అమె ప్రియుడు ఫిజియోధెరఫిస్టు రాజేష్ ను పట్టించింది మాత్రం మటన్ సూప్.

వివరాల్లోకి వెళితే… తన భర్త యాసిడ్ దాడికి గురయ్యాడంటూ… గాయాలపాలైన రాజేష్ ను సుధాకర్ రెడ్డి పేరుతో హాస్పిటల్ లో జాయిన్ చేసి.. నాటకానికి తెరలేపిన స్వాతి.. బంధువులకు కూడా ఇదే విషయాన్ని చెప్పింది. అయితే సుధాకర్ పేరుతో రాజేష్ అక్కడ చికిత్స చేసుకుంటున్నాడు. కొడుకు ఎంత అపద వచ్చిందోనని అంగలార్చుకుంటూ వచ్చిన సుధాకర్ రెడ్డి తల్లిదండ్రులు… కుటుంబ సభ్యులు రాజేష్ వ్యవహారశైలి అనుమానాలను రేకెత్తించింది. కానీ.. దానిని వ్యక్తం చేయలేకపోతున్నారు. అయితే అదే సమయంలో అసుప్రతి సిబ్బంది రాజేష్ కు మటన్ సూప్ ఇచ్చారు.

మటన్ ను జుర్రుకుంటూ లాగించే తమ కొడుకు మటన్ సూప్ ను వద్దని అంటున్నాడెందుకు అన్న అనుమానాం వచ్చింది. సిబ్బంది అప్పటికి మూడు నాలుగు సార్లు చల్లారిపోతుంది తీసుకోవాలని చెప్పారు. కానీ సుధాకర్ రెడ్డి తనకు వద్దని చెప్పాడు. ఇక్కడే సుధాకర్ రెడ్డి తల్లిదండ్రులకు అనుమానాలు బలపడ్డాయి. అసుప్రతిలో సుధాకర్ రెడ్డి పేరుతో చికిత్స తీసుకుంటున్న రాజేష్ బ్రహ్మాణ యువకుడు. ఇతను చిన్ననాటి నుంచి మాంసాహారాన్ని స్వీకరించడు. దీంతో అప్పటికప్పుడు పథకం రచించారు సుధకార్ రెడ్డి తల్లిదండ్రులు.

తమ కొడుకు స్థానంలో మరో వ్యక్తి వచ్చినట్లు అనుమానాన్ని అసుపత్రి సిబ్బందితో వ్యక్తం చేసిన వారు.. వారి సాయంతో రాజేష్ వేలిముద్రలు తీసుకోవడం.. వాటిని పోలీసులకు అందించడం చకచకా జరిగిపోయాయి. వాళ్ల పరిశోధనలో ఆ వేలిముద్రలు సుధాకర్ రెడ్డివి కాదని… రాజేశ్ అనే వ్యక్తివని తేల్చారు. తర్వాత స్వాతిని అదుపులోకి తీసుకోవడం.. ఆమెను తమదైన శైలిలో ఇంటరాగేట్ చేయడంతో అసలు విషయం బయటపడింది. దీంతో మటన్ సూప్ మొత్తానికి రాజేష్-స్వాతీల నాటకానికి తెరదించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sudhakar Reddy  Rajesh  Swathi  illicit affair  mutton soup  Mahbubnagar  crime  

Other Articles