Get Your Mobile Mobile Verified sitting at home మొబైల్-అధార్ లింక్ చేయనివారికి గుడ్ న్యూస్..

Get your mobile mobile verified with or without aadhaar card

mobile aadhaar link, aadhaar, aadhaar mobile link, aadhaar card, aadhaar number, verify mobile number, india

The mobile phone users will be able to verify their mobile numbers through Aadhar without having to visit the stores of telecom companies from January 1, 2018.

మొబైల్-అధార్ లింక్ చేయనివారికి గుడ్ న్యూస్..

Posted: 12/09/2017 08:43 PM IST
Get your mobile mobile verified with or without aadhaar card

మొబైల్ తో  ఆధార్ ను అనుసంధానం చేయని వారికి శుభవార్త. ఇప్పటి వరకు మీ మొబైల్ ఫోన్ ను అధార్ తో అనుసంధానం చేయలేదా..? అయితే మరికొద్ది రోజుల్లో మీరు ఇంట్లో కూర్చోనే ఈ పని చేసుకోవచ్చు. ఇంటి దగ్గర నుంచే మొబైల్.. ఆధార్ లింక్ చేసుకొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వన్ టైమ్ పాస్ వర్డ్ ద్వారా ఆధార్ తో అనుసంధానం చేయొచ్చు అంటున్నారు. ఈ విధానం 2018 జనవరి 1 నుంచి అందుబాటులోకి రానుంది. ఆధార్ తో మొబైల్ అనుసంధానానికి చివరి గడువు ఫిబ్రవరి 6వ తేదీ.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 50 కోట్లపైనే మొబైల్ నెంబర్లు ఆధార్ తో లింక్ కావాల్సి ఉంది. ఇప్పటి వరకు ఆయా టిలికాం కంపెనీలకు వెళ్లి ఆధార్ లింక్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది మరింత ఆలస్యం అవుతుండటంతో.. టెలికాం కంపెనీలు ఐవిఆర్ఎస్ (ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్) ద్వారా మొబైల్ – ఆధార్ లింక్ కి సన్నాహాలు చేస్తున్నాయి. మీరు ఇంట్లో ఏ మొబైల్ నెంబర్ తో అయితే ఆధార్ లింక్ కావాల్సి ఉందో.. ఆ నెంబర్ నుంచి కాల్ చేస్తారు.

ఆధార్ నెంబర్ యాడ్ చేస్తారు. వెంటనే కన్ఫర్మేషన్ కోసం ఓటిపి (వన్ టైం పాస్ వర్డ్) నెంబర్ మొబైల్ కు వస్తుంది. ఓటిపి నెంబర్ యాడ్ చేయగానే మొబైల్ కి ఆధార్ లింక్ అయిపోతుంది. ప్రస్తుతం గ్యాస్, ఇతర సర్వీసులకు ఐవీఆర్ఎస్ సిస్టమ్ ఎలా అయితే వర్క్ చేస్తుందో.. అదే తరహాలో ఉంటుంది. దేశంలోని అన్ని భాషల్లో జనవరి ఒకటి నుంచి ఈ విధానం అమల్లోకి రాబోతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles