pawan says he is not so cool as chiranjeevi కులం అన్నది భ్రమే.. నేను భారతీయుడ్ని: పవన్

Pawan kalyan warns parties and media not to pertian him to caste

Jana Sena, Pawan Kalyan, chalore chalore chal, polavaram project, east godavari, west godavari, R Krishanaih, caste, Indian, human, rajamundry, party activists, telugu states tour, political tour,condolence, krishna ferry turndown, victim families, telangana, msc physics student, murali, Andhra Pradesh

JanaSena chief, power star Pawan Kalyan slams castism, he asks media and others not to pertain him to one caste. he says he is an Indian and more than that he is an humanitarian.

ITEMVIDEOS: కులం అన్నది భ్రమే.. నేను భారతీయుడ్ని: పవన్

Posted: 12/07/2017 03:56 PM IST
Pawan kalyan warns parties and media not to pertian him to caste

తాను రాష్ట్ర పర్యటనల్లో భాగంగా పర్యటనలు చేసిన ప్రతిసారి తనకు ప్రజల నుంచి వచ్చిన అధరణను చూసి ఓర్వలేక కోందరు తనపై రాళ్లు వేశారని జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాన్ మండిపడ్డారు. మరీ ముఖ్యంగా తనను కులనాయకుడ్ని చేయడానికి ప్రయత్నాలు సాగాయని అన్నారు. తాను ఎక్కడికి వెళ్లినా తన కులానికి చెందిన నాయకులు అక్కడికి చేరుకుని హంగామా చేశారని అంధ్రజ్యోతి దినపత్రిక రాసిందని.. అలాగని ఆ పత్రిక యజమాని రాధాకృష్ణకు తనకు మధ్య ఎలాంటి వైరం లేదని అన్నారు. అయితే తాను వరంగల్, బళ్లారీ, ఖమ్మం ఇలా అనేక ప్రాంతాల్లో పర్యటించానని, అక్కడ తన కులం నేతలు ఎవరున్నారని ప్రశ్నించారు.

కులం అన్నది రాజకీయాలలో పనికిరాదని అయన అభిప్రాయపడ్డారు. కులం అన్నది ఒక భ్రమ అని అన్నారు. కులం అనే విషయానికి రాజకీయాల్లో అంత ప్రాధాన్యత ఎందుకివ్వాలని ప్రశ్నించారు. రాజకీయాల్లో కులానికి అంత ప్రాధాన్యత వుంటే పాలకొల్లులో తన సోదరుడు, ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవిని ప్రజలు ఎందుకు ఓఢించారని నిలదీశారు. కులం అన్నది సామాజిక సత్యమే కానీ కులం అన్నది మిథ్య అని అన్నారు. అయితే తాను మాత్రం ఒక కులానికి, మతానిక పరిమితమైన వ్యక్తిని కాదని, తనది భారతీయం మని, అంతకుమించి మానవత్వం వున్నవాడినని వ్యాఖ్యానించారు.

పనిలో పనిగా బిసి సంక్షేమ సంఘం అర్ కృష్ణయ్యపై కూడా మండిపడ్డారు పవన్. కాపులను బిసీలలో చేర్చితే అంగీకరించమని అర్ క్రిష్ణయ్య నిలదీస్తున్న విషయమై స్పందించిన పవన్ కాపులను బిసీల జాబితాలో చేర్చుతామని ఎన్నికల మానిపెస్టోలో పెట్టినప్పుడు మాత్రం ఎందుకు మౌనం వహించారని ఆయన ప్రశ్నించారు. ఇక తనను ఒక్క కులానికి పరిమితం చేస్తే.. ఆయా వ్యక్తులు, కార్యాయాలకు సంబంధించిన అఫీస్ బాయ్ నుంచి అధినేత వరకు కులసంఘాలకు సంబంధించిన విషయాలన్నింటినీ బయటకు తీయాల్సివస్తుందని హెచ్చరించారు.

కాపు రిజ‌ర్వేష‌న్లు చేస్తే బీసీలు గొడ‌వ‌ప‌డ‌తారు.. విధ్వంసం జ‌రుగుతుంద‌ని కొంద‌రు అన్నారు. కాపులకి బీసీలు వ్య‌తిరేక‌మ‌ని ఎందుకు అనుకుంటున్నారు. నాపై విమ‌ర్శ‌లు చేసేట‌ప్పుడు కాస్త ఆలోచించండి. ప్ర‌జారాజ్యం పార్టీలాగా, ఆ పార్టీలో చేరిన‌ కొంద‌రు వ్య‌క్తుల్లాగా నేను బ‌ల‌హీన‌మైన వ్య‌క్తిని కాదని అన్నారు. తాను చిరంజీవిలా సహనం వున్న వ్యక్తిని కాదని అన్నారు. ఆయన ఇంటికి పెద్ద కొడుకు కాబట్టి.. సహనం ఓర్పు వచ్చేశాయని.. కానీ తాను మాత్రం అందుకు భిన్నమని చెప్పారు. పరకాల లాంటి వ్యక్తులు తిట్టేసి వెళ్లిపోయినా చిరంజీవి సహనంతో వున్నారన్నారు. దమ్ముంటే అదే పరకాలను జనసేనలోకి వచ్చి తిట్టమని చెప్పండీ అని సవాల్ విసిరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jana Sena  Pawan Kalyan  chalore chalore chal  east godavari  west godavari  rajamundry  politics  

Other Articles