China claims Indian spy drone shot down చైనా భూభాగంలో భారత డ్రోన్ పేల్చివేత

China claims indian drone invaded its airspace and crashed

China, Chinese border troops, chinese military, Chinese State Media, Doklam, Doklam Plateau, Doklam standoff, Gen Bipin Rawat, India China, Indian Army, Indian drone, Indian drone in China, Indian drone in Chinese airspace, Indian drone invade China, Xinhua, xinhua news agency

Chinese media claimed that an Indian drone had "invaded" China's airspace and crashed. This comes months after India and China ended one of the worst border standoffs in decades at the Doklam tri-junction.

చైనా మీడియా కథనాలు.. తమ భూభాగంలో భారత్ డ్రోన్ పేల్చివేత..

Posted: 12/07/2017 12:23 PM IST
China claims indian drone invaded its airspace and crashed

చైనా మీడియా మళ్లీ ఓ సంచలన కథనాన్ని ప్రచురించింది. భారత్ కు చెందిన ఒక డ్రోన్‌ తమ గగనతలంలోకి వచ్చిందని చైనా ఆర్మీ అధికారులు దానిని కూల్చివేసినట్లు కథనంలో పేర్కొనింది. భారత దేశానికి చెందిన డ్రోన్ చైనా గగనతలంలోకి వెళ్లిందా..? అన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. అయితే ఇలా జరిగిందని ఏకంగా చైనా అధికార మీడియా కథనాన్ని వెలువరించడం కూడా సంచలనంగా మారింది. నిన్నమొన్నటి వరకు ఇరు దేశాల మధ్య డోక్లాం సరిహద్దు వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నగా.. అప్పట్లో అలాంటి వార్తా కథనాలనే ప్రచురించిన మీడియా.. మళ్లీ ఇన్నాళ్లు ఇలాంటి కథనాన్ని ప్రచురించడం చర్చనీయాంశంగా మారింది.  

చైనా ప్రాదేశిక సౌర్వభౌమత్వాన్ని ఉల్లంఘించేలా భారత్ చర్య ఉందని అర్మీ అధికారులు అక్షేపించారని కథనంలో పేర్కోనింది. అయితే ఇలాంటి ఘటనలపై తాము తీవ్ర అసహనం, అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామని కూడా చైనా ఆర్మీ డిప్యూటీ డైరెక్టర్‌ జాంగ్‌ షౌలీ మీడియాతో తెలిపారని పేర్కోంది. అయితే భారత్ కు చెందిన డ్రోన్‌ ఎక్కడి నుంచి వచ్చింది..? ఎక్కడ పేల్చివేయబడింది..? ఎప్పుడు వచ్చింది..? అన్న వివరాలను మాత్రం మీడియా వెల్లడించలేదు. చైనా సరిహద్దు దళాలు డ్రోన్‌ను గుర్తించినట్లు పేర్కొన్నారు.

అయితే దీనిపై భారత అధికారుల నుంచి ఇంకా స్పందన రాలేదు. కాగా కొద్ది నెలల క్రితం భారత్‌-చైనా మధ్య డోక్లాం వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. భారత భద్రతకు భంగం కలిగేలా చైనా రోడ్డు నిర్మాణం చేపట్టిందని మన దేశం ఆరోపించింది. భారత సైన్యం దాన్ని అడ్డుకోవడంతో చైనా మండిపడింది. భారత సైన్యం వెనక్కి వెళ్లిపోవాలని, లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని పలు మార్లు హెచ్చరించింది. దాదాపు రెండున్నర నెలల ఉద్రిక్తత తర్వాత ఆగస్టులో డోక్లాం వివాదం సద్దుమణిగింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : china  India  drone  chinese army  Indain army  chinese state media  Gen Bipin Rawat  

Other Articles