Hyderabad Metro Rail Offers 10% discount on smart card trips రాయితీ ప్రకటించిన హైదరాబాద్ మెట్రో.. కండిషన్స్ అప్లై..

Hyderabad metro rail offers 10 discount on smart card trips

Hyderabad Metro Rail, Smart Card, Hyderabad Metro Rail offers, Hyderabad Metro Rail discount, Hyderabad Metro Rail smart card offer, Hyderabad Metro Rail, Smart Card, paytm, cash back, financial year, Hyderabad

Hyderabad Metro Rail announced a 10 per cent discount on all trips made through Smart Cards up to 31st March 2018. Moreover Paytm is offering a flat Rs 20 cash back on the first-time recharge of Rs 100 or more per card for passengers recharging smart cards

రాయితీ ప్రకటించిన హైదరాబాద్ మెట్రో.. కండిషన్స్ అప్లై..

Posted: 12/07/2017 10:21 AM IST
Hyderabad metro rail offers 10 discount on smart card trips

మెట్రో రైలు ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ తీపి కబురును అందించింది. ఈ అర్థిక సంవత్సరం చివరి వరకు తమ రైలులో ప్రయాణించే ప్రయాణికులకు రాయితీ ప్రకటించింది. ఎంత అంటే ప్రయాణించిన ప్రతీ సారి ప్రయాణికులుకు పదిశాతం రాయితి అందుతోందని తెలిపింది. అయితే అందుకు ఒక కండీషన్ ను పెట్టింది. అందరు ప్రయాణికులకు ఈ రాయితీ వర్తించదని, కేవలం స్మార్ట్ కార్డ్ వినియోగదారులకు మాత్రమే పదిశాతం రాయితీ ఇవ్వనున్నట్లు  ప్రకటించింది. మెట్రో ప్రాజెక్టుకు లభిస్తున్న ఆదరణ నేపథ్యంలో కృతజ్ఞతాపూర్వకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

మెట్రో రాయితీతో పాటు స్మార్ట్ కార్డ్ రీచార్జిపై(మొదటిసారి) రూ.20 పేటీఎం క్యాష్‌బ్యాక్ ఇవ్వనున్నట్లు వివరించింది. మెట్రోలో ఇబ్బందుల్లేని ప్రయాణం కోసం స్మార్ట్‌కార్డ్‌లను ఉపయోగించాలని సూచించింది. కాగా, మొదటి రైలు ఉదయం 6 గంటలకు నాగోల్, మియాపూర్, అమీర్‌పేట్ నుంచి ప్రారంభమవుతుంది. ఆ తర్వాత రాత్రి పది గంటలకు చివరి రైలు నాగోల్ నుంచి అమీర్‌పేట్, మియాపూర్ నుంచి అమీర్‌పేట్‌కు ఉంటుంది. మియాపూర్ నుంచి అమీర్‌పేట్‌కు ప్రతి 8 నిమిషాలకు, నాగోల్ నుంచి అమీర్‌పేట్‌కు ప్రతి 16 నిమిషాలకు ఓ రైలు ఉంది. భవిష్యత్తులో ఈ సమయాన్ని మరింత తగ్గించేందుకు చర్యలు తీసుకుంటామని మెట్రో వర్గాలు వెల్లడించాయి.

ఇక మెట్రో స్టేషన్లలో తాగునీటిని అందుబాటులో ఉంచుతున్నారు. డస్ట్‌బిన్‌లను మాత్రం భద్రతా కారణాల రీత్యా ఏర్పాటు చేయడంలేదు. స్టేషన్లలో అత్యవసర ప్రకటనలను మాత్రమే సిబ్బంది చేస్తారు. మిగతావన్నీ ఆటోమేటిక్‌గా వస్తాయి. నాగోల్, పరేడ్ గ్రౌండ్స్, రసూల్‌పురా, బాలానగర్, కూకట్‌పల్లి, మియాపూర్ స్టేషన్ల వద్ద ప్రత్యేకంగా పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. కాగా, స్టేషన్ లోపలికి వెళ్లాక రెస్ట్‌రూంను ఉపయోగించుకోవాల్సి వస్తే.. సిబ్బంది అనుమతితో పబ్లిక్ స్పేస్‌లో ఏర్పాటు చేసిన బాత్రూంలను ఉపయోగించుకోవచ్చని మెట్రో వర్గాలు తెలిపాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hyderabad Metro Rail  Smart Card  paytm  cash back  financial year  Hyderabad  

Other Articles