Tensions prevails at osmaina university ఓయులో మళ్లీ ఉద్రిక్తత.. పోలీసుల లాఠీచార్జ్

Tensions prevails at osmaina university

tension prevail at OU, osmania university, student organistationsOsmania University, OU student murali suicide, OU student Murali, students under pressure, Murali friends, OU student suicide, murali, unemployement., suicide, academic pressure

Osmania student organisations and students demand exgretia to MSc first year student murali as he commited suicide alleging unemployement.

ఓయులో మళ్లీ ఉద్రిక్తత.. పోలీసుల లాఠీచార్జ్

Posted: 12/04/2017 02:43 PM IST
Tensions prevails at osmaina university

ఉస్మానియా విశ్వవిద్యాలయం మళ్లీ అట్టుడికింది. యూనివర్సిటీలో ఎమ్మెస్సీ ఫిజిక్స్ చదువుతన్న ప్రథమ సంవత్సరం విద్యార్థి మురళి అత్మహత్య నేపథ్యంలో నిన్నటి నుంచి ఉద్రిక్తంగా మారిని విశ్వవిద్యాలయంలో.. పోలీసులు ఎట్టకేలకు శ్రమించి రాత్రి వరకు శాంతియుత వాతావరణాన్ని తీసుకువచ్చారు. ఈ క్రమంలో ఉద్యోగం రాకపోవడం వల్లే మనస్థాపంతో మురళి అత్మహత్య చేసుకున్నాడని అరోపిస్తున్న విద్యార్థులు అతనికి నష్టపరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద ఆందోళన చేపట్టడం.. ఉద్రిక్తతలకు దారితీసింది.

మురళి ఆత్మహత్యపై క్రితం రోజు నుంచి యూనివర్సిటీ క్యాంపస్ రణరంగంగా మారింది. కాగా, మురళీ బౌతికాయాన్ని స్వస్థాలానికి పంపించిన అనంతరం విద్యార్థులు ఆయనకు నష్టపరిహారాన్ని ప్రకటించాలని డిమాండ్ చేస్తూ.. ఈ ఉదయం విద్యార్థులు మరోసారి ఆర్ట్స్ కాలేజీ వద్ద ఆందోళన చేట్టారు. మురళి కుటుంబానికి ఎక్స్ గ్రేషియా ప్రకటించాలంటూ డిమాండ్‌ చేస్తూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో ర్యాలీ చేపట్టగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. విద్యార్థులు రాళ్లు రువ్వటంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జీ చేశారు. దీంతో ఒక్కసారిగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వాతవరణం ఉద్రిక్తంగా మారిపోయింది.

అయితే పోలీసులపై తిరుగుబాటు చేస్తున్న విద్యార్థులను గుర్తించామని, ఇక ఇప్పటిదాకా కవ్వింపు చర్యలకు పాల్పడిన 34 మందిని విద్యార్థులను అరెస్ట్ చేసినట్లు డీసీపీ ప్రకటించారు. నేతలు క్యాంపస్‌లోకి రావటం వల్లే పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయని ఆయన అంటున్నారు. ఒత్తిడి తట్టుకోలేక పోతున్నానంటూ మురళి ఓ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకోగా.. విద్యార్థి సంఘాలు మాత్రం ఉద్యోగాల నోటిఫికేషన్లు రావటం లేదని తీవ్ర ఒత్తిడికిలో ఉన్న మురళీ మనస్తాపానికి లోనై బలవన్మరణం చెందాడని చెబుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles