jayalalithaa letter proves livein relationship సోగ్గాడితో సహజీవనాన్ని అప్పుడే అంగీకరించిన జయ

Jayalalithaa letter proves livein relationship with shobanbabu

jayalalitha shoban babu livein relationship, jayalalithaa shoban babu daughter, jayalalithaa, shoban babu, livein relationship, stat and style magazine, jayalalithaa letter, amrutha sarathy, deepa jayakumar, tamil nadu

tamil nadu former and late chief minister jayalalithaa agrees her live in relationship with telugu actor shoban babu and wrote a letter to star and style magazine editor in this regard in connection with an article.

‘‘పవిత్ర బంధం వుంటే తప్పా’’ అంటూ అప్పట్లోనే జయ లేఖ

Posted: 12/04/2017 11:02 AM IST
Jayalalithaa letter proves livein relationship with shobanbabu

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత ఆమె వైవాహిక బంధం గురించి ఎన్నో వార్తలు వచ్చాయి. అమ్మ వారసులమంటూ ఓ కొడుకు ఇప్పటికే కోర్టు చేత మొట్టికాయలు వేయించుకోగా.. తాను జయ కూతరినేనంటూ బెంగళూరుకు చెందిన అమృత కూడా న్యాయస్థానాన్ని అశ్రయించి భంగపడ్డారు. అయితే జయలలితకు అమ్మాయి వుందన్న విషయం మాత్రం ఇప్పుడు నిజమని స్పష్టమైంది. జయ మేనకోడలు దీపా జయకుమార్ కూడా తమ మేనత్తకు ఆడపిల్ల వుందన్న విషయం వాస్తవమేనని అన్నారు. ఇక తాజాగా జయ మేనత్త కూతురు లలిత కూడా ఇదే అంశాన్ని నిజమని ప్రస్తావనకు తీసుకురావడంతో తమిళనాడులో ఇప్పుడిదే అంశం హాట్ టాపిక్ గా మారింది.

నిప్పులోన కాలదు, నీటిలోన మునగదు, గాలిలోన అరదు నిజం సత్యమన్న పెద్దలు మాటలు మాత్రం వాస్తవమని స్సష్టం చేస్తూ పుట్టకుముందు నుంచి అజ్ఞతవాసాన్ని ఎదర్కొంటున్న జయ కూతురికి అమె మరణంతోనైనా అది వీడిపోవాలని కోరుకోని తమిళుడు లేడంటే అతిశయోక్తి కాదు. జయకు, నటుడు శోభన్ బాబుకు పుట్టిన సంతానాన్ని న్యాయస్థానాలు నిర్థారించాలని కూడా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అయితే అమృతే జయ కూతుర్న విషయాం ఇప్పుడు తమిళనాడు వ్యాప్తంగా అమ్మ అభిమానులు విశ్వసిస్తున్నారు. ఇదే విషయాన్ని జయ స్నేహితురాలు కూడా తెలిపారు. ఈ విషయాన్ని శోభన్ బాబే తనతో స్వయంగా చెప్పారని పేర్కొన్నారు.

అయితే తాజాగా జయలలిత-శోభన్ బాబుల మద్యన నడుస్తున్న సహజీవనాన్ని వేలెత్తి చూపుతూ ఓ అంగ పత్రిక ప్రచురించిన కథనంపై అమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనిపై అప్పట్లోనే అమె స్టార్ అండ్ స్టైల్ పత్రిక సంపాదకవర్గానకిి ఓ ఘాటు లేఖను రాసింది. శోభన్ బాబుతో తాను సహజీవనం చేస్తున్నానని, ఆయన వివాహితుడు కావడంతో పెళ్లి చేసుకోలేకపోతున్నానని 1979లోనే జయలలిత అంగీకరించి.. తమ మధ్య వున్నది అత్యంత పవిత్ర బంధమని.. దానిని చులకనగా చూడటం కానీ వెలెత్తి చూపడం కాని సముచితం కాదని కోరింది.

ఈ లేఖ ఆ తరువాత వెలుగులోకి రావడంతో ఓ తమిళ పత్రిక కూడా దీనిని అనువదించి కథనాన్ని ప్రచురించింది. ఆ పాత్రికేయుడిని కూడా తన వద్దకు పిలిపించుకన్న జయలలిత.. పెళ్లైన తరువాత ఎవరు ఎన్ని వెదవ వేషాలు వేసినా చెల్లబాటు అవుతాయి కానీ పెళ్లి కాకుండా తాము అత్యం పవిత్రంగా ఓ బంధాన్ని ఏర్పర్చుకుంటే మాత్రం తప్పా అని నిలదీసింది. ఈ విషయం ఇప్పుడు బయటకు రావడంతో అమృత ఆమె కూతురే అన్న అనుమానాలు బలపడుతున్నాయి. అంతేకాదు.. జయలలితకు కూతురు ఉన్న మాట వాస్తవమేనని జయ మేనత్త కూతురు లలిత కూడా చెప్పడం గమనార్హం.

అమృత పిటిషన్‌ను తోసిపుచ్చిన అత్యున్నత న్యాయస్థానం ఈ విషయాన్ని కర్ణాటక హైకోర్టులో తేల్చుకోవాలని సూచించింది. కోర్టులో ఆమె దాఖలు చేసిన పిటిషన్ ప్రకారం.. ఆగస్టు 14, 1980లో జయలలితకు అమృత జన్మించారు. పెంపుడు తల్లి శైలజ 2015లో, తండ్రి ఈ ఏడాది మార్చి 20న మృతి చెందారు. జన్మనిచ్చిన తల్లి బతికి ఉన్నప్పుడు తాను కుమార్తెనని ప్రకటిస్తే ఆమె కీర్తి ప్రతిష్ఠలు దెబ్బతింటాయని భావించి ఇన్నాళ్లు దాచిపెట్టినట్టు అమృత పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశంతో అమృత ఇప్పుడు కర్ణాటక కోర్టు మెట్లు ఎక్కేందుకు సిద్ధమవుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh