tremors in hyderabad jubilee hills అదిరిపడిన హైదరాబాద్ హృదయం.. ప్రకంపించిన ప్రకృతి

Tremeors in hyderabad jubilee hills

tremeors in kbr park, tremeors jubilee hills, tremors in banjara hills, tremors in hyderabad, tremors, kbr park, kasu bramhananda reddy park, jubilee hills, banjara hills, ngri, earth quake

tremeors in hyderabad jubilee hills which was scaled 0.5 on rector scale says NGRI. Tremours are of very low density and officials say no need to worry

అదిరిపడిన హైదరాబాద్ హృదయం.. ప్రకంపించిన ప్రకృతి

Posted: 11/15/2017 02:57 PM IST
Tremeors in hyderabad jubilee hills

హైదరాబాద్ మహానగరం అదిరిపడింది. హైదరాబాద్ నగర హృదయంగా బాసిల్లుతున్న ప్రాంతంలో భూ ప్రక జూబ్లీహిల్స్‌లో భూ ప్రకంపనలు సంభవించాయి. ఇవాళ ఉదయం భూమి స్వల్పంగా కంపించింది. కేబీఆర్‌ పార్క్ కేంద్రంగా భూమి ప్రకంపించినట్లు గుర్తించిన ఎన్జీఆర్‌ఐ అధికారులు.. అత్యల్ప స్థాయిలో ప్రకంపనలు సంభవించాయని తెలిపారు. ఈ ప్రకంపనల కేబీఆర్ పార్కుతో పాటు దాని చుట్టూరా వున్న జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, దుర్గం చెరువు ప్రాంతాలకు కూడా వ్యాపించాయని తెలిపారు.

భూ ప్రకంపనల ప్రభావం అధికంగా జూబ్లీహిల్స్‌, దుర్గంచెరువు ప్రాంతాలపై వుందని ఎన్జీఆర్ఐ అధికారులు తెలిపారు. ఉదయం 8:20 గంటలకు, 8:35 గంటలకు, 8:50 గంటలకు వరసగా భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై 0.3 నుంచి 0.5గా నమోదు అయ్యింది. దాదాపు రెండు సెకన్లపాటు భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు. ఇది చాలా స్వల్పం అని.. ఎలాంటి భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని ప్రకటించారు.

అయితే మూడు పర్యాయాలు భూమి ప్రకంపించినా.. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకపోవడంతో హైదరాబాద్ నగరవాసులు ఊపిరీ పీల్చుకున్నారు. అయితే ప్రకంపనలపై భయపడాల్సిన అవసరం లేదని ఎన్జీఆర్‌ఐ అధికారులు తెలిపారు. హైదరాబాద్ లో భారీ వర్షాలతో భూగర్భ జలాలు పెరిగాయి. నీటి నిల్వలు పెరగటం వల్ల భూమిలోని పలకల మధ్య సర్దుబాటు కారణంగా ఈ ప్రకంపనలు వచ్చాయని తెలిపారు అధికారులు. ఇటీవలే బోరబండలో భూమి కంపించిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tremors  kbr park  kasu bramhananda reddy park  jubilee hills  banjara hills  ngri  earth quake  

Other Articles