IT raids at Sasikala's kin, associates Almost Completed | అప్పుడు జయ కాపాడింది.. మరి ఇప్పుడు?

It raids almost complete on sasikala family

VK Saikala, Operation Sasikala, Sasikala IT Raids, Sasikala Dinakaran IT Raids, IT Officials about Sasikala Tax Evasion, Sasikala Tax Evasion

Income Tax (IT) officials continued their massive raids at the premises of close relatives of jailed AIADMK leader V.K. Sasikala, their business associates and organisations connected to them, a senior IT official said. He also said that "sizeable volume of cash and documents" have been seized at the searched premises.

ఆపరేషన్ శశికళ.. దాదాపు పూర్తి!

Posted: 11/11/2017 09:42 AM IST
It raids almost complete on sasikala family

తమిళనాడు వ్యాప్తంగా రెండు రోజులుగా ఐటీ అధికారులు చేపట్టిన ఆపరేషన్ విజయవంతమైంది. దివంగత జయలలిత నెచ్చెలి.. అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పన్నుఎగవేత ఆరోపణలతో శశికళ కుటుంబ సభ్యులు, సన్నిహితులు, బంధువర్గానికి సంబంధించిన 147 ప్రాంతాల్లో 1800 మంది ఐటీ సిబ్బంది ఏకకాలంలో దాడులు నిర్వహించారు.

ఈ సందర్భంగా శశికళ సంబంధీకులు పది బోగస్ కంపెనీల పేరిట 1000 కోట్ల రూపాయల పన్నులు చెల్లించకుండా అవకతవకలకు పాల్పడ్డారని ఐటీశాఖ నిర్ధారించినట్లు సమాచారం. బినామీ పేర్లతో 10 బోగస్‌ సంస్థలను ప్రారంభించిన శశికళ కుటుంబీకులు పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడ్డారని ఐటీ వర్గాలు తెలిపాయి. 1996లో శశికళ కుటుంబంపై తొలిసారి ఐటీ దాడులు జరగ్గా.. ఆ సమయంలో జయ అండతో ఆమె తప్పించుకుందనే ఓ వాదన ఉంది.

దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత ఇఫ్పుడు మళ్లీ ఈ దాడులు చోటు చేసుకున్నాయి. పెద్ద నోట్ల రద్దు సమయంలో ఈ బోగస్‌ కంపెనీలు, సొంత వ్యాపారాలు, పార్టీ సంస్థలు, కార్యాలయాల ద్వారా పెద్దఎత్తున నగదుమార్పిడీకి పాల్పడ్డారని ఐటీ అధికారులు తెలిపారు. ఈ అవకతవకల్లో భాగమై, శశికళ డైరెక్టర్‌ గా ఉన్న ఫెన్సీ స్టీల్‌, రెయిన్‌ బో ఎయిర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, శుక్రా క్లబ్‌, ఇండో -దోహ కెమికల్స్‌ అనే నాలుగు సంస్థలు గత నెల మూసేయడం విశేషం.

స్వాధీనం చేసుకున్నవి...

ఇండో-దోహా కెమికల్స్ సంస్థలో ఇళవరసి, ఆమె బంధువు కులోత్తుంగన్‌ లు డైరెక్టర్లు. చెన్నైలోని నీలాంగరైలోని శశికళ బంధువు భాస్కరన్‌ ఇంట్లో లెక్క చూపని 7 కేజీల బంగారాన్ని ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆపై కొన్నిచోట్ల డైమండ్లను స్వాధీనం చేసుకోగా.. వాటికి చిన్నమ్మ బంధువులకు సంబంధం ఉన్నట్లు తేల్చారు. మన్నార్‌ గుడిలో శశికళ సోదరుడు దివాకరన్‌ నిర్వహిస్తున్న సెంగమళతాయార్‌ మహిళా కళాశాల విడిది గృహంలో 25 లక్షల రూపాయల నగదు, 6 రోలెక్స్‌ గడియారాలు, బంగారం, తదితరాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అంతేగాక శశికళకు చెందిన 315 బ్యాంకు ఖాతాలనూ స్తంభింపజేసినట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles