former CS iyr krishna rao slams AP govt రాజధాని నిర్మాణమంటే సినీమా సెట్టింగా..? ఐవైఆర్ ఫైర్

Former chief secretary iyr krishna rao fires on ap government

iyr krishna rao, ap cmo, chandrababu naidu, andhra pradesh, high court, cinema set, directors, rajamouli, former cs, amaravthi, politics

former chief secretary of Andhra pradesh iyr krishna rao fires on TDP government, questions in a satirical way that construction of capital is not a cineme setting.

రాజధానంటే సినిమా సెట్టింగా..?టీడీపీ సర్కారుపై ఐవైఆర్ సెటైర్..

Posted: 10/24/2017 03:38 PM IST
Former chief secretary iyr krishna rao fires on ap government

అధికారంలోకి రాకముందు హైదరాబాద్ ను అభివృద్ది చేసింది తానేనని ప్రకటించుకున్న టీడీపీ అదినేత చంద్రబాబు.. అదే దీక్ష, పట్టుదలతో నవ్యాంధ్రప్రదేశ్ లోకూడా రాజధానిని అభివృద్ది చేస్తానని.. అందుకనే తనకు అధికారాన్ని అందించాలని అర్థించి.. అధికారంలోకి రాగానే రాజధాని లేని రాష్ట్రమంటూ అంగలార్చారని, ఇక అమరావతి నిర్మాణం విషయంలో అయన మదిలో అనేక అలోచనలు వరుగులు పెడుతున్నాయని ఈ విషయంలో ఆయా రంగ ప్రముఖులతో చర్చించాల్సిన చంద్రబాబు.. దానిని పక్కనబెట్టి సినిమావాళ్లతో చర్చలు జరపడమేంటని ఆయన ప్రశ్నించారు.

చంద్రబాబు ప్రభుత్వం రాజధాని నిర్మాణమంటే సినీమా సెట్టింగ్ అని భావిస్తుందా అని ఐవైఆర్ వ్యంగంగా ప్రశ్నించారు. సింగపూర్ ప్రభుత్వంతో కుదర్చుకున్న స్విస్ ఛాలెంజ్ విధాన ఒప్పందం పూర్తిగా లోపభూయిస్టంగా వుందని, దానిని తక్షణం రద్దు చేసుకోవాలని ఇప్పటికే ఏపీ ప్రభుత్వాన్ని హెచ్చిరించిన ఆయన.. ఈ ఓప్పందంలో అనేక తప్పులు వున్నాయని చెప్పారు. రాజధాని నిర్మాణంలో ఇబ్బందులు వస్తే ల్యాండ్ పుల్లింగ్ కింద భూములిచ్చిన రైతులే అధికంగా నష్టపోతారని హెచ్చరించారు. రాజధాని నిర్మాణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఖరి నిర్లక్ష్యంగా ఉందన్నారు.

సరైన ప్లానింగ్‌ లేకపోవడం వల్లే రాజధాని నిర్మాణంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని అన్నారు. కాగా  ప్రపంచస్థాయి రాజధాని నిర్మిస్తామంటూ ప్రకటించిన ముఖ్యమంత్రి  ఈ నగరం డిజైన్ల బాధ్యతను మొదట జపాన్ కు చెందిన మకి అసోసియేట్స్ సంస్థకు అప్పగించారు. ఆ సంస్థ అందించిన డిజైన్లు అద్భుతమంటూ ఆకాశానికెత్తి, ఆ తర్వాత ఆ డిజైన్లు బాగోలేవంటూ మకిని తొలగించారు. ఆ తర్వాత లండన్‌కు చెందిన నార్మన్ ఫోస్టర్ సంస్థ ఐదారుసార్లు డిజైన్లు రూపొందించినా ముఖ్యమంత్రికి నచ్చలేదు. చివరకు ఫోస్టర్ సంస్థకు సలహాలిచ్చి డిజైన్లు రూపొందించే బాధ్యతను బాహుబలి దర్శకుడు రాజమౌళికి అప్పగించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles