TTDP crusial meet abrupted without concluding ఒంటరైన రేవంత్.. ప్రశ్నలు గుప్పించిన టీటీడీపీ నేతలు..

Revanth reddy questioned in ttdp crusial meet

revanth reddy, revanth reddy joining congress, revanth ttdp leader, Revanth Reddy, working president, Telangana Telugu Desam Party, Congress, mothkupally narsimlu, Uma MadhavaReddy, Hyderabad, Telangana

In the wake of rumours that Revanth Reddy is joining Congress, Telangana TDP leaders motkupalli and Uma madhava Reddy questioned him directly in TTDP crusial meet.

ఒంటరైన రేవంత్.. ప్రశ్నలు గుప్పించిన టీటీడీపీ నేతలు..

Posted: 10/20/2017 02:34 PM IST
Revanth reddy questioned in ttdp crusial meet

తెలంగాణ టీడీపీ సమావేశం వాడీవేడిగా సాగినా.. అర్ధాంతరంగా ముగిసింది. సమావేశానికి హాజరైన ముఖ్యనేతలకు వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో హాజరైన రేవంత్ రెడ్డి షాక్ ఇచ్చారు. రేవంత్ హాజరు కారు అనుకన్న పార్టీ నేతల అశలపై నీళ్లు చల్లారు. అంతేకాదు ఈ సమావేశంలో రేవంత్ రెడ్డిను ఒంటిరిని చేసి ప్రశ్నల వర్షం కురిపించినా.. అన్నింటికీ ఆయన ఒకే సమాధానం చెప్పడంతో.. సమావేశం నుంచి అర్థాంతరంగా బయటకు వచ్చేసిన టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు మీడియాతో ఏమీ మాట్లాడకుండానే వెళ్లిపోయారు.

ఈ సమావేశానికి హజరైన రేవంత్ రెడ్డికీ.. ఇతర తెలంగాణ టీడీపీ నేతలకు మధ్య వాగ్వాదం కూడా జరిగినట్లు సమాచారం. కాగా సమావేశప్రారంభంలో టీడీపీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారని లీకులు ఇవ్వాల్సిన అవసరం ఏమిటీ..? ఎందుకిలా చేస్తున్నారని ఉమామాధవ రెడ్డి రేవంత్ ను ప్రశ్నించారు. అనంతరం మోత్కుపల్లి నర్సింహులు కూడా రేవంత్ పై పలు ప్రశ్నలను సంధించారు. అయితే టీడీపీ నేతలు అడిగిన ప్రశ్నలకు రేవంత్ రెడ్డి అసలు సమాధానమే చెప్పలేదు.

ఎవరి అనుమతితో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిశారని రేవంత్ రెడ్డీని మోత్కుపల్లి, అరవింద్ ప్రశ్నించారు. చంద్రబాబు అనుమతి తీసుకున్నారా అని అడిగారు. అసలు కాంగ్రెస్ నేతలను కలిసే అవసరం ఏమిటీ, ఎందుకోచ్చిందని ఆయన ప్రశ్నించారు. దీనికి తోడు పోరుగు రాష్ట్రంలో వున్న మన టీడీపీ నేతలపై అరోపణలు ఎందుకు చేశారన్న కూడా ప్రశ్నించారు. సొంత పార్టీకి చెందిన నేతలపై విమర్శలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. దీనికి సమాధానంగా, మీడియాలో వచ్చిన వార్తలకు తాను ఎలా బాధ్యుడిని అవుతానని రేవంత్ అన్నారు.

ఇక తెలంగాణ టీడీపీ నేతలు నుంచి ఊహించని విధంగా ప్రశ్నల వర్షం కురుస్తున్న నేపథ్యంలో రేవంత్ ఒక్క సమాధానం అందరినీ అగ్రహావేశాలకు గురిచేసింది. తాను తెలంగాణ టీడీపీ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని ఆయన సూచించారు. తనను ప్రశ్నించే అధికారం పార్టీ నేతలకు లేదని, ఈ క్రమంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు వద్దే అన్ని విషయాలను తేల్చుకుంటానని అన్నారు. రేవంత్ రెడ్డి సమాధానంతో సీనియర్ నేతలు మోత్కుపల్లి, అరవింద్ వెళ్లిపోయారు. దీంతో, సమావేశం అర్ధాంతరంగా ముగిసింది.

తాము ఏది అడిగినా రేవంత్ రెడ్డి సరైన సమావేశం ఇవ్వలేదని అన్నారు. రాహుల్ ను కలిశారా? ఒకవేళ కలిస్తే ఎందుకు కలిశారో చెప్పాలని రేవంత్ ను కోరామని...చంద్రబాబుకే వివరణ ఇస్తానని రేవంత్ చెప్పారని టీటీడీపీ నేత, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి అరవిందకుమార్ గౌడ్ తెలిపారు. రేవంత్ నుంచి సమాధానాలు సరిగ్గా రాకపోవడంతో తాను, మోత్కుపల్లి సమావేశం నుంచి వాకౌట్ చేశామని చెప్పారు. వివరణ ఇవ్వాలంటూ పార్టీ నేతలంతా కోరినప్పటికీ... రేవంత్ మాత్రం సమాధానాలను దాటవేశారని అరవింద్ అన్నారు. టీడీపీ వల్లే రేవంత్ ఈ స్థాయికి వచ్చారని చెప్పారు. రేవంత్ రెడ్డి టీడీపీని వీడినా పార్టీకి వచ్చే నష్టం ఏమీ లేదని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Revanth Reddy  working president  TTDP  Congress  mothkupally narsimlu  Uma MadhavaReddy  Telangana  

Other Articles