baba molests women on the pretext of Exorcism భూతవైద్యం పేరుతో మహిళలతో బూతు పనులు

Haryana based mannan baba held for sexual assault on hyderabadi women

mannas baba, baba molests hyderabadi women, baba sexual harrasment on women, baba molestation, mothersa, donations, sexual assault, old city women, Hyderabad, haryana, Telangana, crime news, crime

haryana based mannan baba who arrived in hyderabad for collecting donations for his mothersa, held for sexual assault on hyderabadi old city women on pretext of Exorcism

భూతవైద్యం పేరుతో మహిళలతో బూతు పనులు

Posted: 10/18/2017 11:56 AM IST
Haryana based mannan baba held for sexual assault on hyderabadi women

హైదరాబాదు పాతబస్తీలోని మహిళ అమాయకత్వాన్ని అసరాగా చేసుకున్న ఓ దొంగబాబా భూతవైద్యం పేరుతో బూతు పనులు చేస్తున్నడటంతో అతడి ముసుగును ఓ మహిళ ధైర్యంగా తొలగింది. బూతు బాబాను రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకు అప్పగించింది. మహిళ చేసి సాహసోపేతమైన పనికి అమెకు అభినందలు వెల్లివిరువగా, పలువురు మతచాంధసవాదులు మాత్రం ఇంకా కళ్లు తెరువపోవడం గమనార్హం. ఇంతకీ ఈ మహిళ దొంగబాబా అటనెట్టా కట్టించిందబ్బా అంటే..

హర్యానాలో నిర్వహిస్తున్న మదర్సా కోసమని విరాళాల సేకరణ పేరిట హైదరాబాద్ నగరానికి చేరుకున్న మన్నన్ బాబా.. పాతబస్తీలో అమాయక మహిళలను టార్గెట్ చేసుకుని వారి అమాయకత్వంతో వారిని బూరిడీ కోట్టించవచ్చని భూతవైద్యుడి అవతారం ఎత్తాడు. హుమయూన్ నగర్ లో మకాం వేసిన ఇతగాడు.. తన వద్దకు వచ్చే అమాయక ముస్లిం మహిళలను గుర్తించి, వారికి శారీరిక, మానసిక సమస్యలు ఉన్నాయని బెంబేలెత్తించేవాడు. అనంతరం సమస్యలు పరిష్కరిస్తానని వారిని బుట్టలో వేసుకునే వాడు.

వారిలో అవహించిన సైతానును వదిలిస్తానని.. వారి నుంచి భూతవైద్యానికి కావాల్సిన ఖర్చులన్నింటినీ తీసుకునేవాడు. ఇలా వైద్యానికి వేరుగా, శాంతికి, పరిహారినికి వేర్వురుగా డబ్బులను తీసుకున్న తరువాత.. వైద్యం పేరుతో వారిని అభ్యంతకరంగా తాకుడూ..  లైంగిక వేధింపులకు గురి చేసేవాడు. అయితే ఇదంతా వైద్యంలో భాగమని నమ్మిన పలువరు మౌనంగా వుండిపోగా.. ఓ మహిళ మాత్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏకంగా భూతవైద్యుడి అవతారాన్నే కట్టించివేసింది.

భార్యభర్తల మధ్య తరచూ మనస్పర్థలు వస్తున్నాయని.. వాటిని పరిష్కరించుకోవాలని ఓ మహిళ తనకు తెలిసిన వ్యక్తుల వద్ద తన అవేదన వ్యక్తం చేసింది. అంతేకాకుండా తమకు మగపిల్లాడి సంతానం కూడా కలగాలని వేచిచూస్తున్నామని.. కూడా చెప్పింది. అయితే భూతవైద్యుడి వద్దకు వెళ్తే.. అన్ని సత్వరంగా సమకూరుతాయని తన పరిచయస్తులు సూచించడంతో.. అతడ్ని అశ్రయించింది. దీంతో వలకు చిక్కిన లేడిపిల్లలా ఆమెను అన్నిరకాలుగా వేధించాడు. అతని వేధింపులకు తాళలేకపోయిన ఆమె డీసీపీ వెంకటేశ్వరరావును ఆశ్రయించింది. దీంతో స్కెస్ వేసిన పోలీసులు, అతనిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని అరెస్టు చేశారు. ఆమె నుంచి 4 లక్షల రూపాయలను నకిలీబాబా దోచేసినట్టు పోలీసులు నిర్ధారించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mannas baba  mothersa  donations  sexual assault  old city women  Hyderabad  haryana  Telangana  crime  

Other Articles