Shweta Kothari Resigns from Republic TV రిపబ్లిక్ టీవీలో మహిళా జర్నోలపై అనుమానాలా.?

Spy allegations journalist quit arnab channel

shweta kothari, shweta kothari republic tv, republic tv journalist resigns, shweta kothari republic tv journalist resigns, shashi tharoor's spy, shashi tharoor, Republic TV, Arnab Goswami, Shweta Kothari, republic TV, correspondent resigns

Shweta Kothari, a senior correspondent with the Arnab Goswami-led Republic TV, has resigned after her editor accused her of being a spy of Congress leader Shashi Tharoor. Tharoor tweeted: “Congratulations on standing up for your own integrity: I don't employ spies, but i do respect serious journalists.”

అర్నబ్ ఛానెల్ లో మహిళా జర్నలిస్టుకు మనోవేదన..?

Posted: 10/14/2017 03:11 PM IST
Spy allegations journalist quit arnab channel

తాను టైమ్స్ నౌ ఛానెల్ లో ఎదుర్కోన్న మనోవేదనను అప్పుడే మర్చిపోయినట్లుంది ప్రముఖ పాత్రికేయుడు అర్నబ్ గోస్వామి. టైమ్స్ నౌ కు విడ్కోలు పలికి వచ్చిన తరువాత కూడా అతను తమ డాటాను అపహరించారని కూడా టైమ్స్ నౌ పత్రిక అతనిపై కేసును నమోదు చేసింది. ఆ పరాభావాన్ని పంటికిందే బిగించి పట్టుకున్న అర్నబ్ రిపబ్లిక్ ఛానెల్ ద్వారా తానేంటో రుజుకు చేసుకుంటున్నాడు. అయితే తాను ఎదుర్కోన్న పరాభవాన్ని ఇతరులెవ్వరూ ఎదుర్కోకూడదని అనుభవ రిత్యా ఎవరైనా భావిస్తారు.

కానీ ఏకంగా నూతనంగా ప్రారంభమైన తన రిపబ్లిక్ చానెల్ లోనే ఓ మహిళా సీనియర్ జర్నలిస్టు.. అంతటి పరాభావాన్ని అనుభవించింది. అంతేకాదు మానసిక వ్యధకు కూడా గురైంది. అమెను కాంగ్రెస్‌ సీనియర్ నేత శశిథరూర్‌కు ఏజెంట్ గా భావించిన యాజమాన్యం అమెను అతని గూడాఛారిగా పరిగణించిందన్న విషయం తెలిసి మనస్తాపం చెందింది. తాను ఛానెల్ లోకి వచ్చి రాగానే అనపై తనకు తెలియని కళ్ల నిఘా కొనసాగుతుందని అమె అవేదన వ్యక్తం చేసింది.

దీంతో అర్నబ్‌ గోస్వామి ఛానెల్‌ రిపబ్లికన్‌ టీవీలో ఇక తాను సీనియర్ కరస్పాండెంట్ గా కోనసాగలేనని, తన వెనుక నిఘా నేత్రాలు పనిచేయడం, తనపై ఓ ముద్రపడటం తనకు నచ్చక ఉన్నఫలంగా తాను రాజీనామా చేశానని.. శ్వేతా కోఠారి రాజీనామా చేశానని పేర్కోంటూ అమె తన ఫేస్‌ బుక్‌లో ఆమె ఓ సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు. గూఢాచర్యం చేశానన్న ఆరోపణలు వాస్తవం కాదు. ఆ మచ్చ నేను భరించలేను. అందుకే ఛానెల్‌ వీడుతున్న అని ఆమె తెలిపారు.

కాగా, శ్వేతా కోఠారి.. కాంగ్రెస్‌ నేత శశిథరూర్‌ కు తమ ఛానెల్‌లోని సమాచారం అందవేసిందన్న అనుమానంతో ఎడిటర్ ఆమెపై నిఘా పెట్టాడంట. ఆమె కదలికలను గమనించి తనకు సమాచారం చేరవేయాలని సిబ్బందికి సూచించాడంట. అంతేకాదు ఆమె ఆర్థిక పరిస్థితులపై కూడా ఆరాతీశాడని చెబుతున్నారు. ఈ విషయాలను ఓ సహోద్యోగి ద్వారా తెలుసుకున్న ఆమె.. ఆ ఆరోపణలను నిర్ధారించుకున్నాకే రాజీనామా నిర్ణయం తీసుకున్నారు.

అయితే సోషల్ మీడియాలో శశిథరూర్‌ను ఆమె ఫాలో కావటం.. పైగా శశిథరూర్‌కు సంబంధించి ఛేంజ్‌.ఓఆర్‌జీ పిటిషన్‌పై శ్వేత సంతకం చేయటంతోనే అర్నాబ్‌ ఆ నిర్ణయానికి వచ్చి ఉంటాడని భావిస్తున్నట్లు ఆమె అంటున్నారు. కాగా, సంస్థలో ఇలా వేధింపులు ఎదుర్కుంటున్న సిబ్బంది చాలా మందే ఉన్నారని ఆమె వ్యాఖ్యానించటం గమనార్హం. ఇక శ్వేతా కొఠారి తీసుకున్న రాజీనామా నిర్ణయాన్ని శశిథరూర్‌ ట్విట్టర్ వేదికగా హర్షించారు. తనకు గూఢాచారులను నియమించుకోవాల్సిన అవసరం లేదన్న ఆయన.. నిజాయితీపరులైన పాత్రికేయులకు తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని ట్వీట్ చేశారు. ఇక అమె నిర్ణయాన్ని పలువురు స్వాగతించగా, పలువురు కార్టూన్ల రూపంలో కూడా మద్దతు తెలిపారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shashi Tharoor  Republic TV  Arnab Goswami  Shweta Kothari  republic TV  correspondent resigns  

Other Articles