Arvind Kejriwal's stolen car traced in Ghaziabad ముఖ్యమంత్రి కారు దొరికేసిందోచ్..!

Arvind kejriwal s blue wagonr missing for 2 days found in ghaziabad

mohan nagar ghaziabad, Kundan Sharma, Kejriwal's car stolen, ITO, iconic blue Wagon R, CM Arvind Kejriwal, Delhi Secretariat

Delhi chief minister Arvind Kejriwal's car, the blue Wagon R, which was stolen from outside the Delhi Secretariat, has been recovered from Mohan Nagar area of Ghaziabad

సీఎం సారు.. నీలం కారు దొరికేసిందోచ్..!

Posted: 10/14/2017 10:22 AM IST
Arvind kejriwal s blue wagonr missing for 2 days found in ghaziabad

ఎట్టకేలకు పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. చోరీకి గురైన ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ కారు దొరికడమే ఇందుకు కారణం. ఘజియాబాద్‌లోని మోహన్‌ నగర్‌ సమీపంలో కారును పోలీసులు గుర్తించారు. అయితే.. ఇది అచ్చంగా సీఎం అరవింద్ కేజ్రీవాల్ కారుమాదిరిగానే వుండటంతో.. ఇంజన్, ఛాసిస్ నెంబర్లను వారు పరిశీలించి.. అది సీఎం కారేనా కాదా అన్న విషయాన్ని నిర్ధారించనున్నారు. అయితే కారును ఎవరు దొంగిలించారు.. ఇక్కడికెందుకు తీసుకువచ్చి వదిలిపెట్టారన్న విషయం మాత్రం తెలియరాలేదు.

దేశంలో సంచలనంగా మారిన వార్త ఓ ముఖ్యమంత్రికి చెందిన కారు దొంగతననానికి గురికావడం. ఈ నేపథ్యంలో ఈ వార్తపై అనేక విమర్శలు కూడా వచ్చాయి. ముఖ్యమంత్రి కారుకే రక్షణను పోలీసులు ఇవ్వలేని సక్షంలో ఇక రాష్ట్రంలోని ప్రజల అస్తులను ఎలా పరిరక్షిస్తారన్న కథనాలు కూడా వెలువడ్డాయి. ఇంతకీ ఆ ముఖ్యమంత్రి ఎవరో అర్థమైంది కదూ. ఆయన మరెవరో కారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. గురువారం నాడు ఢిల్లీ సెక్రటేరియట్ నుంచే ఆ కారును దొంగలించబడింది.

దీనిపై కేజ్రీవాల్‌ ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌ను ప్రశ్నించారు. ‘కారుకే భద్రత లేకపోతే.. ఇక సామాన్యుడి మాటేంటి? కారు పోవడం చిన్న విషయమే.. కానీ అది సచివాలయం ఎదుట పోయింది. దిల్లీలో శాంతి, భద్రతలు గాడితప్పుతున్నాయనడానికి ఈ ఘటన నిదర్శనం’ అని కేజ్రీవాల్‌ గవర్నర్ కు రాసిన లేఖలో నిలదీశారు. 2013లో కుందర్‌ శర్మ అనే ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఆ కారును కేజ్రీవాల్‌కు విరాళమిచ్చారు. దిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ కేజ్రీవాల్‌ ఆ కారును ఉపయోగించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles