Gates of Srisailam dam opened for first time this year శ్రీశైలం నుంచి సాగర్ కు కృష్ణమ్మ పరవళ్లు

Srisailam dam fills up two crest gates lifted to release water

Srisailam, Nagarjunasagar, Srisailam Floodgates, Srisailam dam, Nagarjuna Sagar dam, Devineni Uma Maheswara Rao, Andhra Pradesh, Telangana, Rabi crop, farmers cheer

The Srisailam Dam on the Krishna river has filled up the massive reservoir, a lifeline for Telugu States, forcing Irrigation Department to lift two crest gates to release water downstream.

మల్లన్న చెంతనుంచి నాగార్జున సాగర్ కు కృష్ణమ్మ పరవళ్లు

Posted: 10/12/2017 11:59 AM IST
Srisailam dam fills up two crest gates lifted to release water

మూడేళ్ల తర్వాత శ్రీశైలం ప్రాజక్టు నిండు కుండలా మారింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలు, వరదలతో తెలుగురాష్ట్రాల రైతులు పాలిట కల్పతరువైన ఈ పూర్తి సామర్థానికి చేరుకుంది. ఈ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుండటంతో అంధ్రప్రదేశ్ ఇరిగేషన్ అధికారులు దిగువకు నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు. దీంతో ఇవాళ ఉదయం అంధ్రప్రదేశ్ ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమ ప్రాజెక్టు వద్దకు చేరకుని పూజలు నిర్వహించారు.

అనంతరం మంత్రి డ్యామ్ కు చెందిన రెండు క్రష్ గేట్లు ఎత్తి 56 వేల క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు. ఒక్కొ గేటును 10 అడుగుల మేర ఎత్తారు. ఎగువన కర్ణాటక రాష్ట్రంతో పాటు రాయలసీమ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో.. మరో మూడు, నాలుగు రోజుల పాటు ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయ నీటి మట్టం 884.80 అడుగులతో 214.8450 టీఎంసీలుగా ఉంది. ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి 1,39,007 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది.

శ్రీశైలం కుడిగట్టు జలవిద్యుత్‌ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 32,878 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు వదిలారు. ఇక ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్‌ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 42,378 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌కు 12,000 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 1600 క్యూసెక్కులు, హంద్రీనీవాకు 338 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీశైలం ఎమ్మెల్యే రాజశేఖర్‌రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే బాలరాజు పాల్గొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles