GST relief for small firms, rates cut for many groups బోజనప్రియులకు, చిన్నపరిశ్రమలకు ఊరట

Gst relief for small firms rates cut for many groups

gst, gst council, gst returns, arun jaitley, narendra modi, gst slabs, gst news, gst rate, gst council, new gst, gst meeting, gst tax, gst new notification, merchant exporter under gst, gst number verification, new gst rates

GST Council, allowed the small firms to their returns quarterly and also made it easier for exporters to claim tax refund. It also reduced the tax rate on over two dozen goods and services categories.

భోజన ప్రియులకు, చిన్న పరిశ్రమలకు ఊరట

Posted: 10/07/2017 10:06 AM IST
Gst relief for small firms rates cut for many groups

వస్తు సేవా పన్న మండలి సమావేశంలో బోజన ప్రియులతో పాటు చిన్న పరిశ్రమలకు కూడా ఊరట కల్పిస్తూ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జీఎస్టీ అమల్లోకి వచ్చిన మూడు నెలల అనంతరం పరిస్థితిని సమీక్షించి విసృత మార్పులు చేసింది. 27 వస్తువులపై పన్ను తగ్గించడం ప్రధానాంశం. పన్నుల చెల్లింపు, రిటర్నుల దాఖలులో చిన్న, మధ్య తరగతి వ్యాపారులకు వెసులుబాట్లు కల్పించింది. ఎగుమతుదారుల విషయంలో నిబంధనలు సడలించింది.

ఈ సందర్భంగా కేంద్ర అర్ధికశాఖా మంత్రి అరుణ్ జైట్లీ మాట్టాడుతూ.. పన్ను మదింపు, చెల్లింపుల్లో చిన్న, మధ్య తరహా వ్యాపారులు పడుతున్న ఇబ్బందులను తొలగించామన్నారు. చిన్న వ్యాపారులకు పెద్ద వూరట.. రిటర్నుల దాఖలులో వెసులుబాటు కల్పించింది. వస్త్ర పరిశ్రమపై  భారం తగ్గింది. రెస్టారెంట్లపై పన్నుల హేతుబద్ధీకరణపై అధ్యయనం చేయాలని, ఎగుమతిదార్లు 0.1% పన్ను చెల్లిస్తే చాలునని నిర్ణయించింది GST మండలి సమావేశం, నాన్ బ్రాండెడ్ ఆయుర్వేద మందులు, నాన్ బ్రాండెడ్ నమ్ కీన్ పై  GST 12 నుంచి 5 శాతానికి తగ్గించారు.

చేతితో వడికిన నూలుపై  GST ని 18 నుంచి 12 శాతానికి తగ్గించారు. మార్బుల్, గ్రానైట్ కాకుండా… ఫ్లోరింగ్ పై పరిచే రాళ్లతో పాటు స్టేషనరీ ఐటమ్స్, డిజిల్ ఇంజిన్ విడిభాగాలు, పంపు విడిభాగాలపై భారాన్ని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించారు. ICDS లో భాగంగా పిల్లలకు ఇచ్చే ఫుడ్ ప్యాకెట్లపై పన్ను భారాన్ని 12 నుంచి 5 శాతంగా మార్చారు. బంగారు ఆభరణాల కొనుగోళ్లకు పాన్ కార్డు, ఆధార్ తప్పని సరి నిబంధనపై GST నోటిఫికేషన్ ను రద్దు చేసింది. 2 కోట్లకు పైగా టర్నోవర్ ఉన్న జెమ్స్, జ్యువెలరీ వ్యాపారులను మనీ లాండరింగ్ నిరోదక చట్టం పరిధిలోకి తీసుకురావద్దని GST కౌన్సిల్ నిర్ణయించింది.

పన్ను భారం తగ్గినవి ఇవే..

12% నుంచి 5%కి తగ్గినవి  
బ్రాండెడ్‌ కాని నమ్‌కీన్‌ .. బ్రాండెడ్‌ కాని ఆయుర్వేద మందులు .. ఎండు మామిడి బద్దలు .. ఖాక్రా (తినుబండారాలు) .. ఐసీడీఎస్‌ పథకం కింద పాఠశాలల్లోని పిల్లలకు ఇచ్చే ఆహార పొట్లాలు .. ఖాకర్నాడ్‌ సాదా చపాతీ/రోటీ .. జరీ, గిల్టు నగలు, ఆహార పదార్థాల తయారీకి సంబంధించిన జాబ్‌ వర్కు పనులు .. ప్రింటింగ్‌ వస్తువులు .. కార్మికులను అధిక సంఖ్యలో ఉపయోగించే ప్రభుత్వ గుత్తేదారుల సేవలు (ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టుల ఖర్చులు అదుపు చేయడానికి ఈ నిర్ణయం తీసుకొంది.) .. మూడు పీసులు ఉన్న సల్వార్‌ సూట్‌ * అసలు జరీ

18% నుంచి 5%కి తగ్గినవి
ప్లాస్టిక్‌ వేస్ట్‌ .. రబ్బర్‌వేస్ట్‌ .. పేపర్‌వేస్ట్‌ .. ప్రభుత్వ పథకాల కింద పేదల కోసం తయారు చేసే ఆహార పదార్థాలు

18% నుంచి 12%కి తగ్గినవి
చేతితో తయారు చేసే నూలు (వస్త్ర పరిశ్రమ వినియోగం కోసం).. కుట్టుమిషన్ల దారం.. సింథటిక్‌ ఫిలమెంట్‌ దారం (నైలాన్‌, పాలిస్టర్‌ వగైరా).. కృత్రిమ ఫిలమెంట్‌ దారం (విస్కోస్‌ రేయాన్‌, కుప్రమోనియం వగైరా).

28% నుంచి 18%కి తగ్గినవి
స్టేషనరీ వస్తువులు (పేపరు క్లిప్పులు, ట్యాగులు తదితరాలు) .. ఇంటి గచ్చులుగా ఉపయోగించే రాళ్లు (గ్రానెట్‌, పాలరాయి కాకుండా) .. డీజిల్‌ ఇంజిన్ల విడిభాగాలు .. పంపుల విడిభాగాలు .. పోస్టర్‌ కలర్లు, మోడలింగ్‌ పేస్ట్‌

28% నుంచి 5 %కి తగ్గినవి
ఈ-వ్యర్థాలు, హార్డ్‌ రబ్బర్‌ వేస్ట్‌

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gst  gst council  arun jaitley  narendra modi  gst slabs  gst tax  new gst rates  

Other Articles