Pakistan's PM rakes up Kashmir issue at UN భారత్ తో సై.. పాక్ ప్రధాని సంచలన ప్రకటన

Pakistan urges un to appoint special envoy to kashmir

Pakistan Prime Minister, Shahid Khaqan Abbasi, united nations, Kashmir dispute, kashmir, Jammu and kashmir, India-Pakistan, latest news

Pakistan Prime Minister Shahid Khaqan Abbasi has urged the United Nations to appoint a special envoy to Kashmir, as he claimed that the struggle of the people in the region is being "brutally suppressed" by India.

కాశ్మీర్ అంశంపై ప్రత్యేక దూత: యుఎన్ ను కోరిన పాక్ ప్రధాని

Posted: 09/22/2017 10:13 AM IST
Pakistan urges un to appoint special envoy to kashmir

న్యూయార్క్ లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన పాకిస్థాన్‌ ప్రధాని షహీద్‌ ఖకాన్‌ అబ్బాసీ భారత్‌ కోల్డ్‌ స్టార్ట్‌ యుద్ధ విధానాన్ని ఎదుర్కొనేందుకు స్వల్ప లక్ష్య అణ్వాయుధాలను తయారు చేసుకున్నామని మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. పాకిస్థాన్‌ అణుభద్రమైన చేతుల్లోనే ఉందన్న అందోళన వద్దని, భారత్‌ కోల్డ్‌ స్టార్ట్‌ యుద్ధ వ్యూహాన్ని నిలువరించేందుకు స్వల్పశ్రేణి అణ్వాయుధాలను తయారు చేశామని చెప్పిన విషయం తెలిసిందే.

ఆ తరువాత ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాశ్మీర్ లో ఏర్పాటువాదుల అంశాన్ని ప్రస్తావించారు. అయితే కాశ్మీర్ అంశంలో భారత్ పాక్ దేశాల మధ్య చర్చలతో పరిష్కారం వస్తుందని అశాభావం వ్యక్తం చేశారు. కాశ్మీర్ అంశంలో యుఎన్ జోక్యం అవసరమని కూడా చెప్పారు. కాశ్మీర్ లో యుద్దనేరాల కోసం ఐక్యరాజ్య సమితి ఓ ప్రత్యేక ప్రతినిధిని నియమించాలని కూడా కోరారు.

అయితే అంతకుముందు ఐక్యరాజ్యసమితి సమావేశంలో మాట్లాడిన అప్ఘనిస్తాన్ ప్రతినిధులు.. పాకస్థాన్ ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారిందని అరోపించారు. ఉగ్రవాదుల అణిచివేతతో పాటు వారిని పూర్తిగా నియంత్రించిన పక్షంలోనే తమ దేశంతో పాటు అసియా దేశాలలో శాంతిసామరస్యతలు వెల్లివిరుస్తాయని అశాభావం వ్యక్తం చేశారు. దీంతో అప్ఘనిస్తాన్ లో భారత్ కు ఎం పనని కూడా పాకిస్థాన్ ప్రధాని అబ్బసీ నిలదీశారు. ఈ క్రమంలో పాకిస్తాన్ ఎవరి చేతిలోనూ గొర్రెగా కాదలుచుకోలేదని అన్నారు. అమెరికాలో అధ్యక్షుడు డోనాల్డ్  ట్రంప్ అధ్వర్యంలో పాకిస్థాన్ పనిచేసేందుకు సిద్దంగా వుందని వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles