virat and rahane consolidate india to 252 అసీస్ ఎదుట టీమిండియా 253 పరుగుల విజయలక్ష్యం

Virat and rahane consolidate india to 252 at eden in 2nd odi

ind vs aus, india vs australia, ind vs aus 2017, india vs australia live score, ind vs aus live score, 2nd ODI, Virat Kohli, Dhoni, Steve Smith, cricket news, sports news, sports, cricket

Indian captain Virat Kohli's 92 stood India in good stead as wickets kept falling at regular intervals, leading to India getting all out for 252 at the second One Day International match between India and Australia at Kolkata

కంగారుల ఎదుట.. టీమిండియా 253 పరుగుల విజయలక్ష్యం

Posted: 09/21/2017 06:48 PM IST
Virat and rahane consolidate india to 252 at eden in 2nd odi

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోమారు కెప్టెన్ ఇన్నింగ్స్ తో రాణించడం.. అతని తోడుగా అజింక్య రహానే కూడా నిలవడంతో.. అసీస్ తో కొల్ కతా వేదికగా ఈడెన్ గార్డెన్ లో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా గౌరప్రదమైన స్కోరును చేసింది. వీరిద్దరూ మినహా మిగిలిన టీమిండియా అటగాళ్లు నిరాశ పరిచారు. కెప్టెన్‌ కోహ్లీ (92), ఓపెనర్‌ రహానె (55) మినహా మిగతా బ్యాట్స్‌మెన్లు విఫలమయ్యారు. దీంతో ఒక దశలో మూడు వందల పైచిలుకు పరుగుల భారీ స్కోరు చేస్తారన్న అంచనాలు తలకిందులయ్యాయి. చివరకు స్కోరుబోర్డుపై 252 పరుగులతో గౌరవప్రదమైన స్కోరుతో సరిపెట్టుకుంది టీమిండియా.

అదిలోనే ఓపెనర్‌ రోహిత్ శర్మ (7) వికెట్ చేజార్చుకున్న టీమిండియా స్కోరుబోర్డును 8 బౌండరీల సాయంతో 92 పరుగులు సాధించిన విరాట్ కోహ్లీ, 7 బౌండరీల సాయంతో 55 పరుగులు చేసిన రహానే పరుగులు పెట్టించారు. వీరిద్దరూ కలసి రెండో వికెట్ కు 102 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో ఇద్దరూ అర్థశతకాలు నమోదు చేసుకున్నారు. ఆ తరువాత 55 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రహానే రనౌట్ అయ్యాడు. దీంతో క్రీజులోకి వచ్చిన మనీష్ పాండే కేవలం మూడు పరుగులు మాత్రమే సాధించి వెనుదిరిగాడు.

ఆ తరువాత క్రీజులోకి వచ్చిన జాదవ్ (24) కొద్దిసేపు కెప్టెన్‌ కోహ్లీతో కలిసి బ్యాట్‌ ఝుళిపించాడు. స్కోరు వేగం పుంజుకుంటున్న క్రమంలో నైల్‌ బౌలింగ్‌లో మాక్స్ వెల్ కు క్యాచ్ ఇచ్చి జాదవ్ వెనుదిరిగాడు. అవెంటనే విరాట్ కోహ్లీ కూడా శతకానికి చేరువగా వచ్చి బౌల్డ్ అయ్యాడు. ఇక ఆతరువాత టీమిండియా క్రికెటర్లు వికెట్లు క్రమంగా పడుతూ వచ్చాయి. ధోనీ(5) భువనేశ్వర్‌ కుమార్‌ (20), హార్దిక్‌ పాండ్యా(20), కుల్దీప్‌ యాదవ్‌ (0), బుమ్రా(10), చాహల్‌(1) స్వల్ప స్కోర్లుకే వెనుదిరిగారు. దీంతో నిర్ణీత ఓవర్లలో టీమిండియా 252 పరుగులకు ఆలౌట్‌ అయ్యి అసీస్ ఎదుట 253 పరుగులు విజయలక్ష్యాన్ని నిర్ధేశించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India vs australia  Team India  cricket australia  virat kohli  rahane  india cricket team  cricket  

Other Articles