Central Mexico earthquake kills more than 100 | భారీ భూకంపం.. వందల ప్రాణాలు బలి... ఊహించని నష్టం

Powerful quake strike central mexico

Mexico Earthquake, Mexico Powerful quake, Mexico Earthquake Donald Trump, Mexico Earthquake, Mexico Earthquake News, Mexico Earthquake Updates

Mexico earthquake: at least 139 dead after powerful quake. Rescue teams in Mexico raise their hands to ask for silence so they can try to hear possible earthquake survivors.

ITEMVIDEOS:భారీ భూకంపం.. 140 మంది మృతి

Posted: 09/20/2017 08:11 AM IST
Powerful quake strike central mexico

మెక్సికో భారీ భూకంపంతో వణికిపోయింది. బుధవారం వేకువ ఝామున పెద్ద ఎత్తున్న ప్రకంపనలు దేశాన్ని కుదేలు చేసింది. రిక్చర్ స్కేలుపై దీని తీవ్రత 7.4గా నమోదయ్యింది. పలు నగరాల్లో తీవ్ర విధ్వంసం నెలకొనగా, భవనాలు పేక మేడల్లా కుప్పకూలిపోయాయి. ఇప్పటికే 140 మంది మృతి చెందినట్టు గుర్తించారు. వేలాది మందికి గాయాలయ్యాయి. వందలాది మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు.

హాహాకారాలు చేస్తూ ప్రాణభీతితో ప్రజలు పరుగులు తీశారు. వేగంగా స్పందించిన ప్రభుత్వం సహాయకచర్యలు ప్రారంభించింది. శిథిలాలను తొలగించే కొద్దీ మృతుల సంఖ్య పెరుగుతోంది. సీసీ కెమెరాల్లో భూకంపానికి సంబంధించిన దృశ్యాలు రికార్డయ్యాయి. కాగా, సరిగ్గా 30 ఏళ్ల క్రితం జరిగిన దుర్ఘటన ఇప్పుడు పునరావృతమైంది. 1987 సెప్టెంబర్ 19న మెక్సికోలోని ఇదే ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. ఆ భూకంపం ధాటికి సుమారు పదివేల మంది ప్రజలు సజీవసమాధి అయ్యారు.

 

మళ్లీ ఇన్నేళ్లకు 7.4 తీవ్రతతో ఈ ప్రాంతాన్ని భూకంపం మరోసారి పట్టికుదిపేసింది. వేలాది మందికి గాయాలయ్యాయి. సహాయకచర్యలు వేగంగా జరుగుతున్నాయి. ప్యూబ్లా, మొర్లస్‌, మెక్సికో సిటీలో భూకంప తీవ్రత ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మధ్యే సంభవించిన భూకంపం, తుపాను ధాటికి మెక్సికో ఇప్పటికే చితికిపోయింది. గోరుచుట్టుమీద రోకటి పోటులా వచ్చిన ఈ భూకంపం ఆ దేశాన్ని మరింత ఇబ్బందుల్లోకి నెట్టింది.

అండగా నిలుస్తాం: ట్రంప్

మెక్సికో భూకంపంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భూకంపంపై స్పందించారు. మెక్సికోకు అండగా నిలుస్తామని చెబుతూ, ప్రకృతి విలయంలో ప్రాణాలు కోల్పోయిన వారికి సానుభూతి తెలిపారు. వివిధ దేశాధినేతలు కూడా దీనిపై స్పందించారు. మెక్సికో వేగంగా కోలుకోవాలని కాంక్షించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles