PV Sindhu Won Korea Open 2017 Title l చరిత్ర సృష్టించిన సింధు.. కొరియా ఓపెన్ చాంపియ‌న్ విజయం

Pv sindhu wins first korea open

PV Sindhu, Korea Open, Championship, PV Sindhu Korea Open, Korea Open 2017 Women Singles, Japan's Nozomi Okuhara, PV Sindhu Nozomi Okuhara Match, Nozomi Okuhara PV Sindhu, PV Sindhu Revenge Victory

Indian Shelter PV Sindhu avenged her World Championships loss as she defeated Japan's Nozomi Okuhara in the Korea Open final on Sunday. .

కొరియా ఓపెన్... సింధు ఘన విజయం

Posted: 09/17/2017 04:37 PM IST
Pv sindhu wins first korea open

సియోల్ లో జరుగుతున్న విక్టర్ కొరియా ఓపెన్ బ్యాడ్మింటన్ ఫైనల్ లో తెలుగుతేజం పీవీ సింధూ, జపాన్ క్రీడాకారిణి నజోమీ ఒకుహరాపై విజయం సాధించింది. తొలి సెట్ ను 22-20 తేడాతో గెలిచిన పీవీ సింధు, రెండో సెట్ ను 11-21 తేడాతో ఓడిపోయి, కీలకమైన మూడో సెట్ లో పుంజుకుంది.

నిర్ణయాత్మకమైన మూడో సెట్ హోరాహోరీగా సాగినప్పటికీ, ప్రత్యర్థికి ఏ దశలోనూ అవకాశం ఇవ్వని సింధూ, మూడో సెట్ ను 21-18 తేడాతో గెలిచి, ఇటీవలి వరల్డ్ బ్యాడ్మింటన్ లో ఒకుహరా చేతిలో తనకు ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది.

మూడో సెట్ లో ఒకుహరా చేసిన తప్పిదాలనే తనకు అనుకూలంగా మలచుకున్న సింధూ, తన కెరీర్ లో మరో చిరస్మరణీయమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సెట్ లో సింధూ 18-16 తేడాతో లీడింగ్ లో ఉన్న వేళ, 56 షాట్ల ర్యాలీ జరుగగా, కీలక పాయింట్ సింధూ ఖాతాలో చేరి ఆమెకు 19వ పాయింట్ ను అందించింది. అదే ఉత్సాహంతో సింధూ మ్యాచ్ ని సొంతం చేసుకుంది.

మ్యాచ్ అనంతరం ఒకుహరా, సింధూకు అభినందనలు తెలిపింది. ఈ మ్యాచ్ ఒక గంటా 23 నిమిషాల పాటు సాగింది. సింధూ మ్యాచ్ ని ప్రత్యక్షంగా చూస్తున్న భారత అభిమానులు ఆఖరి పాయింట్ సాధించగానే హర్షధ్వానాలు చేశారు. ఆమె గెలుపుపై భారత క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేశారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : PV Sindhu  Korea Open  Championship  

Other Articles