London Subway explosion is terrorist attack సబ్ వే మెట్రో రైలుపై ఉగ్ర పంజా.. ప్రయాణికుల పరుగులు

London subway explosion is terrorist attack

Blast, explosion, London, London Blast, london explosion, london metro, London Metropolitan Police, London terror attack, London Underground Tube Station, Parsons Green, Parsons Green tube station, Terrorism, train, UK, ISIS, Terrotist attack

TWENTY people were injured including a schoolboy in a failed bucket bomb terror attack on the London Underground during this morning's rush hour. Police confirmed it as a terrorist incident,

ITEMVIDEOS: సబ్ వే మెట్రో రైలుపై ఉగ్ర పంజా.. ప్రయాణికుల పరుగులు

Posted: 09/15/2017 02:57 PM IST
London subway explosion is terrorist attack

వరుస ఉగ్రదాడులతో వణికిపోతున్న బ్రిటెన్ లో మరో మారు ఉగ్రవాదులు పంజా విసిరారు. పశ్చిమ లండన్ పరిధిలోని పార్సన్స్ గ్రీన్ రైల్వేస్టేషన్లో ఇవాళ ఉదయం అఫీసు వేళల్లో పేలుళ్లు సంభవించాయి. లండన్ సబ్ వే (భూగర్భ మెట్రో) రైలులో ఇవాళ ఉగ్రవాదులు రెండు బకెట్ బాంబులను రైలులో పెట్టి.. వారి దిగిపోయిన తరువాత దానిని పేల్చాడంతో భారీ విస్ఫోటనం సంభవించింది. ఈ ఘటనలో 18 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను అదికారులు అంబులెన్స్ లలో అస్పత్రికి తరలించారు. కాగా మరో బకెట్ బాంబు కూడా వుందని పోలీసులకు సమాచారం అందడంతో దానిని నిర్వీర్యం చేసేందుకు బాంబు స్వ్కాడ్ ను రంగంలోకి దింపారు.

ఒక్కసారిగా రైలులో పేలుడు సంభవించడంతో ప్రయాణికులు భయబ్రాంతులకు లోనయ్యారు. గట్టిగా కేకలు వేస్తూ పరుగులు పెట్టడంతో స్వల్పంగా తొక్కిసలాట చోటుచేసుకుంది. అపీసు వేళలు కావడంతో రైలులో కార్యాలయాలకు, పాఠశాలలకు వెళ్తు ప్రయాణికులతో రైలు రద్దీగా ఉంది. అదే సమయంలో పేలుడు సంభవించిడంతో ప్రయాణికులు భాయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనతో తాత్కాలికంగా స్టేషన్‌ను మూసేసినట్లు అధికారులు తెలిపారు. ఆ ప్రాంతమంతా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. లండన్ పోలీసులు పేలుడుపై విచారణ చేపడుతున్నారు.

ఇది ఖచ్చితంగా ఉగ్రవాదుల చర్యేనని అలానే భావిస్తున్నట్లు చెప్పిన మెట్రోపాలిటిన్ పోలీస్ అధికారి.. అ కోణంలోనే దర్యాప్తు చేపట్టనున్నామన్నారు. ఓ తెలుపు రంగు బకెట్లో పేలుడు సంభవించి దాని నుంచి మంటలు వస్తున్నాయన్న వార్తలతో దానిని పోలీసులు పరిశీలించారు. బకెట్ ను స్వాధీనం చేసుకుని దర్యాప్తును సాగిస్తున్నారు. కాగా బకెట్ విస్పోటనం జరిగిన ప్రాంతమంతా రక్తపు మరకలు ఉన్నాయని ప్రత్యక్ష సాక్షి తెలిపారు. ఈ ఘటనపై బ్రిటన్‌ ప్రధానమంత్రి థెరిస్సా మే దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అధికారులను ఎప్పటికప్పుడు అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Blast  explosion  London  Parsons Green  Parsons Green tube station  subway train  UK  ISIS  Terrotist attack  

Other Articles