New Rs. 100 Coins That Are Coming Soon ఎంజీఆర్, ఎంఎస్ సుబ్బలక్ష్మీ బొమ్మలతో రూ. 100 నాణేలు

Rs 100 coins to be issued to mark mg ramachandrans birth centenary

Rs 100 coins, Ministry of Finance, Govt to launch Rs 100 coins, new Rs 10 coins, new Rs 5 coins, MG Ramachandran, birth centenary, Economy, banknotes, lower denomination series, Rs 200 notes, Rs 50 notes, Reserve Bank of India, RBI

The Rs. 100 coin will be 44 millimeter in diameter with a metal composition of silver (50 per cent), copper (40 per cent), nickel (5 per cent) and zinc (5 per cent).

ఎంజీఆర్, ఎంఎస్ సుబ్బలక్ష్మీ బొమ్మలతో రూ. 100 నాణేలు

Posted: 09/12/2017 07:29 PM IST
Rs 100 coins to be issued to mark mg ramachandrans birth centenary

భారత ప్రజలు కనివీని ఎరుగని రూ. 2000 కొత్త నోటును నోట్ల రద్దు నేపథ్యంలో చెలామణిలోకి తీసుకువచ్చిన కేంద్రప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుని దాదాపుగా పది నెలలు కావస్తున్న క్రమంలో కూడా ఇంకా నూతనమైన నిర్ణయాలను తీసుకుంటూ.. ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తుంది. ఇటీవల వినాయక చవితి సందర్భంగా గత నెల 25న కొత్తగా రూ.200 నోటును చెలామణిలోకి తీసుకువచ్చిన కేంద్రం.. చిల్లర సమస్యను తొలగించేందుకే ఈ నోటును విడుదల చేస్తున్నట్లు తెలిపింది.

అయితే ఇప్పటికీ ఈ నోటును చూడని వాళ్ల సంఖ్య అసంఖ్యాకమే. ఈ తరుణంలో త్వరలో కొత్తగా వంద రూపాయిల కాయిన్లను విడుదల చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. అన్నాడీఎంకే వ్యవస్థాపకులు, తమిళ నటుడు డాక్టర్ ఎంజీ రామచంద్రన్ శతజయంతోత్సవాలను పురస్కరించుకుని ఆయన కేంద్ర ఈ నిర్ణయం తీసుకున్నట్లు అర్థిక శాఖ పేర్కోంది. రూ. 100 నాణేలాను రెండు ఫార్మెట్లలో ముద్రించనున్నట్లు కేంద్ర అర్థిక శాఖ స్పష్టం చేసింది.

దీంతో పాటు కొత్త రూ. 10, రూ. 5 నాణెలను ముద్రిస్తున్నట్లు కూడా పేర్కొంది. రూ. 100 కాయిన్ వ్యాసం 44 మిల్లీమీటర్లు ఉంటుందని తెలిపింది. రూ. 100 కాయిన్ పై నాలుగు సింహాల అశోకుని స్థూపం ఉంటుందని వివరించింది. కాగా వెనుక పక్కన ఒక ఫార్మెట్ లో ఎంఎస్ సుబ్బలక్ష్మీ బోమ్మను ముద్రించనున్నట్లు అర్థిక శాఖ తెలిపింది. ఇక మరో ఫార్మెట్ లో వంద నాణేలా వెనుక భాగంలో ఎంజీ రామచంద్రన్‌ బొమ్మ ఉంటుందని తెలిపింది. ఇక వంద రూపాయల నాణెం బరువు 35 గ్రాములు ఉంటుందని, దీన్ని తయారు చేయడానికి వెండి, రాగి, నికెల్‌, జింక్‌ల మిశ్రమాన్ని వినియోగిస్తున్నట్లు వెల్లడించింది.

23 మిల్లీమీటర్ల వ్యాసార్థంతో ఉండే రూ.5 నాణేల బరువు 6 గ్రాములు ఉంటుందని చెప్పింది. దీంతో పాటు కొత్తగా రూ. 10 నాణేలను కూడా ముద్రిస్తున్నట్లు అర్థిక శాఖ ప్రకటనలో పేర్కొనింది. ఐదు రూపాయల నాణేం వెనుక పక్కన ఎంజీ రామచంద్రన్‌ బొమ్మను ముద్రించగా, రూ. 10 నాణెం వెనుక ఎంఎస్ సుబ్బలక్ష్మీ బొమ్మను ముద్రించామని పేర్కొంది. ఎంఎస్ సుబ్బలక్ష్మీ, రామచంద్రన్ ల శతజయంతిని పురస్కరించుకుని నాణేలతో పాటు పోస్టల్‌ స్టాంపులను విడుదల చేయాలని తమిళనాడు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles