FIR filed against Eknath Khadse అంజలిపై బీజేపి నేత అసభ్యకర వ్యాఖ్యలు.. కేసు నమోదు..

Case against eknath khadse over alleged obscene remarks against activist

Eknath Khadse, Anjali Damania, FIR, Aam Aadmi Party, corruption charges, birthday celebration, Jalgaon, Public meeting, Vakola Police, First Information Report, Crime

The Vakola police registered a FIR against MLA Eknath Khadse for allegedly making a 'lewd' statement on social activist and former AAP member Anjali Damania

ITEMVIDEOS: అంజలిపై బీజేపి నేత అసభ్యకర వ్యాఖ్యలు.. కేసు నమోదు..

Posted: 09/08/2017 01:05 PM IST
Case against eknath khadse over alleged obscene remarks against activist

మహారాష్ట్ర మాజీ మంత్రి, బీజేపీ నేత ఏక్ నాథ్ ఖడ్సే ఇప్పటికే పదవిపోయి చిక్కుల్లో పడిన ఈ నేత చేయకూడని వ్యాఖ్యలు చేసిన మళ్లీ చిక్కులు కొనితెచ్చుకున్నాడు. తన పదవిఛుత్యుడు కావడానికి కారణమైన అవినీతి వ్యతిరేక ఉద్యమ కార్యకర్త.. మాజీ ఆప్ నేత.. అంజలి దమనియాపై అసభ్యకర వ్యాఖ్యలు చేసి మరో కేసులో చిక్కున్నాడు. ఏక్ నాథ్ ఖాడ్సే మహారాష్ట్ర మంత్రిగా కొనసాగుతూ అవినీతికి పాల్పడ్డారని, అక్రమాలకు చోటు కల్పించారని అమె అరోపించారు.

దాని వివరాల్లోకి వెళ్తే... అవినీతికి వ్యతిరేక ఉద్యమ కార్యకర్తగా గుర్తింపు పోందిన.. అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న అంజలి దమనియా.. మహారాష్ట్ర బీజేఎల్సీ నేతగా సేవలందించి, ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఏక్‌ నాథ్‌ ఖడ్సేపై వచ్చిన తీవ్ర అవినీతి ఆరోపణలకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. తన కార్యకర్తలతో కలసి కోర్టులో ఆయనకు వ్యతిరేకంగా ప్రజాప్రయోజన వ్యాజ్యం వేయగా, విచారణలో ఆయనపై వచ్చిన అరోపణలు నిజమని తేలింది. దీంతో ఏక్ నాథ్ ఖడ్సే మంత్రి పదవి కోల్పోయారు.

ఈ నెల 2న తన జన్మదిన వేడుకలను ఆయన మద్దతుదారులు నిర్వహించారు. జలగావ్ లో ఒక బహిరంగ సమావేశాన్ని ఏర్పాటు చేసి వేడుకలను నిర్వహించగా.. అందులో పాల్గోన్న ఆయన అంజలిపై ఆయన అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. తన పట్ల అభ్యంతరకర విధంగా వ్యాఖ్యలు చేసిన ఖాడ్సేపై పోలీసులకు పిర్యాదు చేసిన ఆమె.. ఒక రోజంతా పోలీసు స్టేషన్ ఎదుటే నిల్చుని అతనిపై కేసు నమోదుచేయాలని డిమాండ్ చేయడంతో.. ఎట్టకేలకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే తాను ఎవరికీ వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని ఖాడ్సే స్పష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Eknath Khadse  Anjali Damania  FIR  Aam Aadmi Party  Jalgaon  Vakola Police  First Information Report  Crime  

Other Articles