gangwar create tension in hyderabad old city పాతబస్తీలో పహిల్వాన్ల కొట్లాట.. ఫలితానివ్వని కార్డన్ సర్చ్

Gangwar create tension in hyderabad old city

shabbir nawab, dabirpura, hyderabad, old city, gangwar, gangsters, cctv footage, cctv visuals, hyderabad police, crime

gangwar in dabirpura area of hyderabad old city raises concern of locals, which took place on wednesday night gangster shabbir nawab critically injured in the inncident.

ITEMVIDEOS: పాతబస్తీలో పహిల్వాన్ల కొట్లాట.. ఫలితానివ్వని కార్డన్ సర్చ్

Posted: 09/07/2017 10:34 AM IST
Gangwar create tension in hyderabad old city

హైదరాబాద్ పాతబస్తీలో ఎలాంటి అసాంఘీక కార్యకలాపాలు చోటుచేసుకోకుండా.. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీసులు క్రమంగా నిర్వహిస్తున్న కార్డన్ సర్చులు నిష్పలంగా మారాయా..? అంటే అంతటా కాకపోయినా.. డబీర్ పురా పోలీస్ స్టేషన్ పరిధిలో మాత్రం అవి అశించిన ఫలితాలను ఇవ్వలేదనే చెప్పాలి. జనంలో రౌడీ అన్న ముద్రతో పాటు అధిపత్యం కొనసాగించేందుకు రెండు గ్యాంగుల మధ్య జరిగిన ఘర్షణే ఈ విమర్శలకు తావిస్తుంది. పోలీసుల నిరంతర నిఘా వున్నా.. అర్థరాత్రి స్థానికులను భయాందోళనకు గురిచేసిన ఘటన ఇది.

బుధవారం అర్థరాత్రి పాతబస్తీకి చెందిన పహిల్వాన్ షబ్బీర్ నవాబ్ పై మరో గ్యాంగ్ కు చెందిన వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. అతనిపై కత్తులు, హకీ స్టిక్కులతో దాడి చేశారు. దాడీలో తీవ్రంగా గాయపడిన షబ్బీర్ ను అతని గ్యాంగ్ కు చెందిన వ్యక్తులు ఘటనాస్థలానికి చేరుకుని హుటాహుటిన చికిత్స నిమిత్తం అసుపత్రికి తరలించారు. అయితే షబ్బీర్ పరిస్థితి ప్రస్తుతానికి నిలకడగానే వుందని వైద్యులు తెలిపారు. పాత కక్షలతో నిందితులు షబ్బీర్ పై దాడి చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

కాగా ఈ దాడి విజువల్స్ సీసీ కెమెరాల్లో రికర్డయ్యాయి. పైన ఫోటోలో నలపు వర్ణం టీ షర్ట్ వేసుకున్న వ్యక్తి రౌడీషీటర్, చైన్ స్నాచర్. పీడీ యాక్ట్ పై జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. అయితే పాతబస్తిలోని డబీర్ పురా ప్రాంతంలో తన ఉనికి చాటుకునేందుకు మరో గ్యాంగుకు చెందిన నవాబ్ పై హత్యాయత్నం చేసినట్టు తెలుస్తోంది. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల గుర్తించిన పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు. బాడీ బిల్డర్ల మధ్య ఆధిపత్య పోరుతోనే ఘటన జరిగిందని తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : shabbir nawab  dabirpura  hyderabad  old city  gangwar  gangsters  cctv footage  cctv visuals  hyderabad police  crime  

Other Articles