Byreddy's Rayalaseema Parirakshana Samithi Closed

Byreddy announcement on party closure

Byreddy Rajashekar Reddy, Rayalaseema Parirakshana Samithi, Party Cancel Statement, TDP

Byreddy Rajashekar Reddy Annonced on Rayalaseema Parirakshana Samithi Shut Down. May Join TDP soon not Officially Confirmed.

తిరస్కరించారు.. పార్టీ మూసేస్తున్నా: బైరెడ్డి

Posted: 09/05/2017 04:28 PM IST
Byreddy announcement on party closure

ఊహించిందే జరిగింది. రాయలసీమ పరిరక్షణ సమితి పార్టీ (ఆర్పీఎస్)ని మూసివేస్తున్నట్టు ఆ పార్టీ వ్యవస్థాపకుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి తెలిపారు. మంగళవారం తాజాగా తన సొంతూరు ముచ్చుమర్రిలో తన అనుచరగణంతో సమావేశం అయ్యాడు బైరెడ్డి. అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.

రాయలసీమ వాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాను కానీ, వారి నుంచి సరైన ప్రోత్సాహం తనకు లభించలేదని అన్నారు. కార్యకర్తలతో చర్చించి త్వరలో ఏ విషయం అనేది ప్రకటిస్తానని తెలిపారు. కాగా, రాయలసీమ పరిరక్షణ పార్టీని 2013లో బైరెడ్డి రాజశేఖరరెడ్డి స్థాపించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని 2013 జులై 30న తీర్మానం వెలువడిన అనంతరం ఆర్పీఎస్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రాంతీయ తత్వ భావజాలంతో ఏర్పాటు చేసిన ఈ పార్టీ హెడ్ క్వార్టర్స్ ఏపీలోని కర్నూలులో ఉంది.

ఈ పార్టీ స్థాపించకముందు ఆయన టీడీపీలో ఉన్నారు. ఏ పార్టీలో చేరే విషయాన్ని తాను త్వరలో ప్రకటిస్తానని అన్నారు. అయితే, టీడీపీలో చేరమని బైరెడ్డి అనుచరులు ఆయనపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles