Eight Indians die in worst UK road crash in 24 years బ్రిటన్ లో విషాదం.. 8మంది భారతీయుల ధుర్మరణం..

Eight indians die in worst uk road crash in 24 years

Wipro employees, UK motorway, road mishap, road accident, indian origin, uk train accident, train accident, uk accident, london train accident, uk accident, uk accident india, indians accident, world news

Eight Indians, including two women, were killed on the spot, and four others injured in a horrific motorway crash in Britain in what is the worst road accident on a UK motorway in 24 years.

బ్రిటన్ లో విషాదం.. 8మంది భారతీయుల ధుర్మరణం..

Posted: 08/28/2017 08:27 AM IST
Eight indians die in worst uk road crash in 24 years

బ్రిటన్ లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పరాయిగడ్డపై తమ సత్తాను చాటి నిపుణులుగా ముద్రవుసుకుని రాణిస్తున్న భారతీయ కుటుంబాల్లో తీరని లోటు ఏర్పడింది. గత 24 ఏళ్లలో త్యంత ఘోర రోడ్డు ప్రమాదం సంభవించి ఎనమిది మంది భారతీయులను కబళించి వేసింది. బకింగ్ హామ్ షైర్ లోని న్యూపోర్ట్ పాగ్నెల్ లో జరిగిన ఈ ప్రమాదంలో టెక్ సంస్థ విప్రో ఐటీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. మొత్తం 12 మంది భారతీయులు, ఒక సిరియన్‌ ప్రమాణిస్తుండగా 8 మంది ప్రాణాలు కోల్పోయారు.  వీరిలో ఇద్దరు మహిళలు ఉన్నారు.

విప్రో ఐటీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులతో వెళ్తున్న మినీబస్ అదుపు తప్పి రెండు లారీలను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఘటనాస్థంలోనే ముగ్గురు విప్రో ఉద్యోగులు మృతి చెందగా మరో వ్యక్తి ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నాడు. ప్రమాదంలో మరణించిన డ్రైవర్ కూడా భారతీయుడే కావడం గమనార్హం. ఇద్దరు లారీ డ్రైవర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వీరిలో ఒకరిపై డ్రంకెన్ డ్రైవ్ కేసు పెట్టిన పోలీసులు నేడు (సోమవారం) కోర్టులో హాజరు పరచనున్నారు. కాగా, నవంబరు, 1993 తర్వాత బ్రిటిష్ మోటార్ వేపై జరిగిన అత్యంత ఘోరమైన ప్రమాదం ఇదేనని అధికారులు తెలిపారు. ఆ ప్రమాదంలో 12 మంది చిన్నారులు, వారి టీచర్ ప్రాణాలు కోల్పోయారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Wipro employees  UK motorway  road mishap  road accident  indian origin  

Other Articles