200 నోటు కాస్త ఓపిక పట్టండి.. దోశ జోక్ తో ట్రోల్ చేస్తున్నారుగా.. | Social Media Trolled with New 200 Note

People troll the new rs 200 note

200 Notes Joke, 200 Notes Jokes, Social Media Troll New Notes, No Notes for Boys, RBI No New Notes for Boys, RBI Saffron Notes, 200 and 50 Rupees Notes Cultural Heritage Hampi 50 Rupees, Sanchi 200 Notes

The Rs 200 banknote is upon us and an endless number of jokes and selfies are flooding social media. After the purple-coloured Rs 2,000 note became the butt of all jokes, people can’t get over the Rs 200 note’s bright yellow print.The jokes on the ‘dosa-coloured’ Rs 200 banknotes are hilarious!

200 నోటు కామెడీ చూశారా?

Posted: 08/26/2017 11:38 AM IST
People troll the new rs 200 note

భార‌తీయ రిజ‌ర్వ్ బ్యాంక్ ప్రజల చిల్లర కష్టాలను తీర్చేందుకు రూ. 200 నోటు విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంతోపాటే కొత్త 50 నోటును కూడా విడుదల చేసింది. ఆగష్టు 25 శుక్రవారం నుంచి వీటిని ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. అయితే ఇంకా పూర్తిగా ప్రజలకు అందబాటులోకి రాలేదు. ఆర్బీఐ బ్రాంచ్ లలో, కొన్ని బ్యాంకులకు మాత్రమే ఇవి చేరాయి. దీంతో నోట్ల ముద్రణ వేగవంతం చేశామని, త్వరలో దేశ ప్రజలకు అందుబాటులోకి తీసుకోస్తామని ఓ ప్రకటనలో ఆర్బీఐ వెల్లడించింది.

కాషాయం రంగులో ఉన్న 200 నోటు మీద మధ్యప్రదేశ్ లోని సాంచీ బౌద్ధ స్థూపం, 50 నోటుపై కర్ణాటక విఠల్ ఆలయం హంపీని వెనకవైపు చిత్రీకరించారు.

మరోవైపు సోష‌ల్ మీడియా వేదిక‌గా 200 నోటుపై జోకులు పేలుతున్నాయి. ముఖ్యంగా నోటు రంగు మీదే చాలా మంది నెటిజ‌న్లు కామెంట్లు కురిపిస్తున్నారు. కాషాయ రంగులో ఉన్న ఈ నోటు దోర‌గా వేయించిన దోశ‌ను త‌ల‌పిస్తుంద‌ని, బాగా మ‌ర‌గ‌బెట్టిన ఇరానీ చాయ్ రంగులో ఉంద‌ని అంటున్నారు. నోటును వినాయ‌క చ‌వితి రోజు విడుద‌ల చేయ‌డాన్ని ప్ర‌స్తావిస్తూ ఇక్క‌డ కూడా మోదీ ప్ర‌భుత్వం హిందుత్వాన్ని చూపించిందని విమ‌ర్శిస్తున్నారు.

మరోపక్క రూ. 2000, రూ. 500, రూ. 200, రూ. 50 ఇలా ఇప్పటిదాకా అమ్మాయిల‌కు బాగా ఇష్ట‌మైన రంగుల్లోనే నోట్లను విడుదల చేశారని, మ‌రి అబ్బాయిల‌ కోసం నోట్లు ప్ర‌చురించ‌రా? అని యంగ్ స్టర్స్ చమత్కరిస్తున్నారు. ఇటీవ‌లే మార్కెట్‌లో ప‌ప్పు ధ‌ర రూ. 200 దాటింద‌ని, అందుకే రూ. 200 నోటును ప‌ప్పు రంగులో ముద్రించార‌ని ఇలా ఎవరికి తోచిన రీతిలో వాళ్లు పంచ్ లు వేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Reserve Bank of India  New Notes  200 Notes  50 Notes  

Other Articles

Today on Telugu Wishesh