6 Mathura cops loot NH2 toll plaza staff of Rs 40000 పోలీసులే టోల్ ప్లాజాను దోపిడీ చేశారు..

Mathura cops booked for thrashing looting nh2 toll plaza staff of rs 40 000

cops loot plaza staff, toll plaza staff looted, NH-2 Toll plaza staff looted, NH2 toll plaza, Mathura cops, policemen booked, mathura, nh2, agra-delhi highway, national highway 2, crime

policemen turned savage and attacked a toll plaza on Agra-Delhi NH 2. The incident came to light after the toll plaza authorities filed a complaint against six policemen for allegedly manhandling staff at the plaza.

ITEMVIDEOS: పోలీసులే దొంగలైతే.. టోల్ ప్లాజాను దోచుకుంటే..

Posted: 08/24/2017 11:03 AM IST
Mathura cops booked for thrashing looting nh2 toll plaza staff of rs 40 000

పోలీసులే దొంగలైతే.. టోల్ ప్లాజాను దోచుకుంటే.. ఓహా ఇలా జరిగిందా..? అలా ఎలా జరగుతుంది..? అలా ఎప్పటికీ జరగదు. దొంగలను పట్టుకోవాల్సిన పోలీసులే ఏకంగా దొంగతనాలకు ఎలా పాల్పడుతారంటూ అనుమానాలను వ్యక్తం చేస్తున్నారా..? కానీ అలాంటి ఘటనే చోటుచేసుకుని సంచలనంగా మారింది. సిఐ స్థాయి అధికారి నేతృత్వంలో ఈ ఘటన జరగడమే సంచలనంగా మారింది. ఏదో కానిస్టేబుళ్లు కాసుల కక్కుర్తికి పాల్పడ్డారంటే అయ్యివుండవచ్చు అన్న అనుమానాలు రేకెత్తే అవకాశాలు వున్నా.. సీఐ స్థాయి అధికారి దొంగల ముఠాకు నేతృత్వం వహించి.. లైస్సెన్స్ కలిగిన దొంగగా మారాడంటే ఇది నిజంగా చిత్రం కాక మరేమిటి.

ఈ ఘటన ఢిల్లీ-అగ్రాలోని రెండో జాతీయ రహదారిపై ఈ నెల 22వ రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు ఏకంగా అ రహాదారిపై వున్న టోల్ ప్లాజా సిబ్బందిని చితకబాది.. కౌంటర్ లో వున్న నలభై వేల రూపాలను నోక్కేశారు. అంతేకాకుండా ఏకంగా రాత్రి 11.30 నుంచి 2.00 గంటల వరకు వాహానాలన్ని ప్లాజాకు డబ్బులు కట్టకుండా వెళ్లిపోయేలా అడ్డుగా వున్న బ్యారీకేడ్లను ఎత్తించేశారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫూటేజీ వెలుగులోకి రావడంతో అది కాస్తా వైరల్ అయ్యింది. పోలీసులు అధికార దుర్వినియోగానికి పాల్పడినా.. వారిపై చర్యలు తీసుకునేందుకు ఉన్నాతాధికారులు మాత్రం ఇంకా మీనమేషాలు లెక్కిస్తున్నారు.

టోల్ ప్లాజ అసిస్టెంట్ మేనేజర్ ఓపి యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. సర్కిల్ ఆఫీసర్ నితిన్ సింగ్ సహా ఆరుగురు పోలీసులు ఆగస్టు 22-23 రాత్రి టోల్ ప్లాజాలోకి బొలేరో వాహనంలో చేరుకున్నారు. వారు ఏకంగా లేన్ 13 గుండా ప్రవేశించేందుకు ప్రయత్నించగా, అది కాస్తా తెరుచుకోలేదు. ఈ లేన్ లో వేగంగా వెళ్లే వాహనాలను మాత్రమే అనుమతిస్తారు. పోలీసుల బోలేరో వాహానానికి ఫ్టాస్ లేన్ ట్యాగ్ లేకపోవడంతో.. వారి వాహనం వచ్చినా అక్కడున్న బ్యారీకేడ్ తెరుచుకోలేదు.

దీంతో కోపోద్రిక్తుడైన సిఐ తన సిబ్బందితో టోల్ ప్లాజాలోనికి చోరబడి అక్కడి సిబ్బందిని చితకబాది.. అక్కడ కౌంటర్ లో వున్న సుమారు రూ.40 వేల నగదు దోచుకెళ్లారని తెలిపారు. అయితే, ఈ కేసులో పోలీసుల వాదన మరోలా వుంది. తాము గస్తీ డ్యూటీలో వుండగా ముగ్గురు వ్యక్తులు వచ్చి, టోల్ ప్లాజా సిబ్బంది అధిక మొత్తంలో ఫీజు తీసుకుంటున్నారని తమకు ఫిర్యాదు చేశారని, దాంతో ప్లాజా మేనేజర్ సహా సిబ్బంది 25 మందిపై కేసు నమోదు చేశామని సర్కిల్ ఆఫీసర్ నితిన్ సింగ్ పేర్కొన్నారు. తమపై ప్లాజా సిబ్బంది చేసిన ఆరోపణలను ఆయన కొట్టిపడేశారు.

పోలీసుల జులుం వెలుగులోకి వచ్చిన తరువాత కూడా వారిపై చర్యలు తీసుకోవడంలో సంబంధింత శాఖాధికారులు జాప్యం చేస్తున్నారు. పోలీసుల దోపిడీ, దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన మీదట తాము స్పందిస్తామని.. ఉన్నతాధికారులు చెప్పడం ఎంతవరకు సమంజసం.? ఇక వాహనదారులు పిర్యాదు చేస్తే టోల్ ప్లాజా సిబ్బందిపై కేసులు నమోదు చేసి కటకటాల వెనక్కి పంపాల్సిన పోలీసులు డబ్బను దొంగలించాల్సన అవసరమెందుకు వచ్చింది.? అక్కడి సిబ్బందిపై తమ ప్రతాపాన్ని చూపాల్పిన అవసవరమెందుకు వచ్చిందన్న ప్రశ్నలకు ఉన్నతాధికారులైనా బదులిస్తారో లేదో వేచి చూడాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : policemen booked  mathura  nh2  agra-delhi highway  national highway 2  crime  

Other Articles

Today on Telugu Wishesh