RBI to introduce Rs 200 notes in September దేశప్రజలకు రిజర్వుబ్యాంకు వినాయకచవితి కానుక..

Reserve bank of india to introduce rs 200 notes beginning september

Soumya Kanti Ghosh, rs 200 note, Rs 50 notes, Ganesh chathurdi, reserve bank of india, remonetise, demonetisation, RBI

RBI is likely to put the proposed Rs 200 bank notes in circulation by the end of August or in the first week of September

దేశప్రజలకు రిజర్వుబ్యాంకు వినాయకచవితి కానుక..

Posted: 08/23/2017 09:45 AM IST
Reserve bank of india to introduce rs 200 notes beginning september

దేశ ప్రజలు కనీవిని ఎరుగని కానుకను కేంద్ర ప్రభుత్వం వినాయకచవితి సందర్బంగా అందించనుంది. అదే రూ. 200 నోటు. దేశ చరిత్రలోనే తొలిసారి 200 డినామినేషన్ గల నోటును వినాయక చవితిని పురస్కరించుకుని ఈ నెల చివర్లో దేశప్రజలకు అందెలా భారతీయ రిజర్వు బ్యాంకు మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఈ నెల చివర్లో రూ.200 నోటులను ప్రజలకు అందుబాటులోకి.. చెలామణిలోకి తీసుకునరావాలని ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే అనివార్య కారణాలు ఎదురైన పక్షంలో ఈ నోటును సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం కానుకగా అందించాలని కేంద్రం భావిస్తుంది. అంటే వచ్చే నెలలో మొదటి వారంలోనే వీటిని అందుబాటులోకి తీసుకురానుంది.

దీంతో పాటు కొత్తగా ముద్రించిన రూ.50 నోటును కూడా చెలమణిలోకి తీసుకురావాలని రిజర్వు బ్యాంకు తలపించినట్లు సమాచారం. ముఖ్యంగా బ్లాక్ మార్కెటింగ్ కు సంబంధించి అన్ని రకాల చర్యలు తీసుకున్న అనంతరం రూ.50 కోట్ల నోట్లను విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ నోట్ల చలామణిలో ఎలాంటి అక్రమ ట్రేడింగ్ జరుగకుండా ఉండేందుకు ఆర్బీఐ అత్యధికంగా ప్రాధాన్యత ఇస్తోంది. ఇప్పటి వరకు రూ.100, రూ.500 డినామినేషన్ నోట్లకు మధ్యలో ఎలాంటి ఇతర డినామినేషన్ నోట్లు లేవు. అయితే కొత్తగా వస్తున్న రూ.200 నోటు ఈ వెలతిని భర్తీ చేస్తుందని మార్కెట్ వర్గాలు యోచిస్తున్నాయి.
 
ఆర్బీఐ ప్రస్తుతం తీసుకురాబోతున్న రూ.200 నోట్లు మరింత ప్రాధాన్యత సంతరించుకోబోతున్నాయి. ఈ కారణంతోనే పకడ్బందీగా ఈ నోట్లను విడుదల చేయాలని చూస్తున్నట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఆర్బీఐ మాత్రం ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. పెద్ద మొత్తంలో ఈ నోట్లను విడుదల చేస్తుండటంతో, సామాన్య ప్రజానీకం ఎదుర్కొంటున్న కార్యాచరణ సమస్యలను ఇవి నిరోధిస్తాయని స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా అర్థికవిభాగం గ్రూప్ చీఫ్ సౌమ్య కాంతి ఘోష్ చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles