షాక్: మెదడువాపుతో కాదు ఆక్సిజన్ అందకే ఆ 30 మంది పిల్లలు చనిపోయారు | Oxygen supply disrupted 30 Children Died in Uttar Pradesh

Lack of oxygen 30 children died in gorakhpur hospital

Uttar Pradesh, Gorakhpur Hospital, Gorakhpur Hospital Deaths, Baba Raghav Das Medical College, Yogi Adithyanath, BRD Deaths, Children Death UP, Oxygen Bill Reason for UP Children Death, New Baby Deaths in Uttar Pradesh

30 Children, Including Newborns, Die In Uttar Pradesh's Gorakhpur hospital. t least 30 children died in the state-run Baba Raghav Das Medical College here during the last 48 hours, district magistrate Rajeev Rautela said on Friday, but gave no reasons for such a large number of deaths.

చిన్నారుల మృతిపై సీఎం సీరియస్

Posted: 08/12/2017 09:04 AM IST
Lack of oxygen 30 children died in gorakhpur hospital

ఉత్తరప్రదేశ్ లో చిన్నారుల మరణం ఘటనపై యూపీ సర్కార్ దిద్దు బాటు చర్యలకు దిగింది. తన సొంత నియోజక వర్గం గోరఖ్ పూర్ లోనే ఇది జరగటంతో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ సీరియస్ గా ఉన్నారు. సంబంధిత మంత్రులతో భేటీ అయిన ఆయన ఒక బృందాన్ని అక్కడికి పంపేందుకు సిద్ధమయ్యారు.

గోర‌ఖ్ పూర్‌లోని బాబా రాఘవ దాస్ (బీడీఎస్) ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుంటున్న చిన్నారుల్లో 30 మంది మృతి చెందిన విష‌యం తెలిసిందే. మెద‌డువాపు వ్యాధితో చనిపోయారని అధికారులు చెప్పినప్పటికీ, ఆస్పత్రిలో ఆక్సిజన్‌ అందకే వారంతా చ‌నిపోయిన‌ట్లు తేలింది. త‌మ‌కు ఆక్సిజ‌న్ స‌ర‌ఫరా చేస్తున్న కంపెనీకి ఆ ఆసుప‌త్రి రూ.66 లక్షల బాకీ ఉంది. ఆ బిల్లు చెల్లించ‌డంలో జాప్యం చేస్తుండ‌డంతో ఆ కంపెనీ ఆసుప‌త్రికి ఆక్సిజన్‌ పంపిణీని నిలిపివేసింది.

ఈ కార‌ణంగానే ఏకంగా 30 మంది అభం శుభం తెలియ‌ని చిన్నారులు మృత్యువాత‌పడ్డారు. అంతేగాక‌, అదే ఆసుప‌త్రిలో మరో 45 మంది చిన్నారులు వెంటిలేషన్‌పై ఉన్నారని స‌మాచారం. వీరిలో అప్పుడే పుట్టినపిల్లలు పది మంది ఉండటం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Uttar Pradesh  BRD Hospital  Children Death  Yogi Adithyanath  

Other Articles

Today on Telugu Wishesh