Delhi Traffic Cop Performs His Duty Despite Heavy Rain వరుణుడి ప్రతాపం.. విధికే ప్రాధాన్యం.. నెట్టింట్లో సంచలనం

Delhi traffic cop performs his duty despite heavy rain

viral video, video viral, Facebook, Mankan Bammi, traffic cop, heavy rain, duties, delhi, ASI Rakesh Kumar, automotive, cars, motorcycles, auto news, auto reviews, mobility, motor shows, road test

traffic cop from Delhi who, despite heavy rains, was seen performing his duty to regulate the vehicle flow. A viral Facebook post by Mankan Bammi captured a traffic cop serving the people and regulating traffic despite heavy rains.

ITEMVIDEOS: వరుణుడి ప్రతాపం.. విధికే ప్రాధాన్యం.. నెట్టింట్లో సంచలనం

Posted: 08/11/2017 11:05 AM IST
Delhi traffic cop performs his duty despite heavy rain

కొందరు పోలీసులు చేసిన పనుల వల్ల యావత్ పోలీసు శాఖకు అవమానాలు. అపవాదులు, చిత్కారాలు ఎదుర్కొంటుంది. మరి అంతకన్నా అధిక సంఖ్యలో కొందరు పోలీసులు తమ విధులను పక్రమంగా నిర్వహిస్తే మాత్రం వీరు పోలీసు శాఖలో వుండాల్సిన వారు కాదు అంటూ ఒక్కరికి మాత్రమే ఆ క్రెడిట్ ను దక్కేలా మాట్లాడతాం. ఈ మంచిని పోలీసు శాఖకు ఎందుకు వర్తింపజేయం. ఇదే ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మన్కన్‌ బమ్మి అనే ఢిల్లీ వాసి తన ఫేస్ బుక్ ద్వారా ఈ ప్రశ్నను నెట్ జనులకు సంధించాడు. ఎందుకిలాంటి ప్రశ్నను ఎందుకున్నాడంటే..

దేశ రాజధాని ఢిల్లీలోని పశ్చిమ విహార్ ప్రాంతం. భారీ వర్షం కురుస్తుంది. వర్షం నీరు నిండటంతో ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోయి ట్రాఫిక్ జామ్ అయ్యింది. అయితే వరుణుడు తన ప్రతాపాన్ని జడివాన రూపంలో ప్రదర్శిస్తున్నా.. దానికి తలవంచని ఓ ట్రాపిక్ పోలీసు.. అందరు పోలీసుల మాదిరిగా ఓ చెట్టు నీడకో, లేక ఏ షెడ్డు కిందకో వెళ్లి తలదాచుకునే ప్రయత్నం చేయలేదు. ఎలాగో తడిసాను.. తన మందుకు తన విధి కనబడుతుంది. విధులు ముందుగా నిర్వహించడానికే ప్రాధాన్యత ఇచ్చాడు. వర్షం వల్ల ఏర్పడిన ట్రాఫిక్ జామ్ ను క్లియర్ చేయడానికి పూనుకున్నాడు. దీంతో ఆయన ప్రస్తుతం నెట్టింట్లో సంచలనంగా మారాడు.

వర్షం నీటిలో తడిస్తే తాను అనారోగ్యం పాలవుతానని తెలిసి కూడా తన డ్యూటీకే ప్రాధాన్యతను ఇచ్చాడు. ఈ వీడియోను తన కారులోని డాష్ బోర్డులో వుప్న సెల్ ఫోన్ తో చిత్రీకరించిన మన్కన్‌ బమ్మి అనే యువకుడు దానిని తన ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేశాడు. పోలీసులు తప్పుచేశారన్న వార్త తెలియగానే వారిని తిట్టుకుంటాం. కానీ, ఇలాంటి పనులు చేసిన సమయంలో అభినందించేందుకు కూడా ముందుకు రావాలి..? ఈ ఘనతను యావత్ పోలీస్ శాఖకు దక్కాలే చేయాలని అని కామెంట్ పెట్టాడు.

అయితే తాను ఆ పోలీసు పేరు అగడటం మర్చిపోయానని, ముందుర మరో కానిస్టేబుల్ ను కలసి అతని పేరును తెలుసుకున్నానని అతని పేరు రాకేష్ కుమార్ అని  కూడా తన కామెంట్ లో వివరించాడు. అతను విహార్ ప్రాంతంలో ట్రాఫిక్ ఏఏస్ఐగా విధులు నిర్వహిస్తున్నాడని కూడా తలిపాడు. రాకేష్ కుమార్ కు సంబంధించిన రెండు వీడియోలు.. అప్ లోడ్ చేయగా, మొదటి వీడియోను సుమారు లక్షన్నరమంది, రెండో వీడియోను సుమారు 3 లక్షల మంది వీక్షించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ASI Rakesh Kumar  viral video  video viral  Facebook  Mankan Bammi  traffic cop  heavy rain  duties  delhi  

Other Articles