500 Notes? Congress Alleges 'Biggest Scam Of Century' రెండు వేర్వేరు రకాలుగా దేశ కరెన్సీ..

2 kinds of rs 500 rs 2000 notes congress alleges scam of the century

Rs 500, two types of Rs 500 notes, Rs 2000 notes, RBI, Rajya Sabha, Kapil Sibal, scam of the century, Ghulam Nabi Azad, Arun Jaitley, demonetisation, House adjourned, Reserve Bank of India

Congress alleged that two types of Rs 500 notes were being printed, Kapil Sibal demonstrating copies of the two variants, while Leader of Opposition in Rajya Sabha, Ghulam Nabi Azad called it the century's biggest scam.

రెండు రకాలుగా దేశ కరెన్సీ.. శతాబ్ధంలోనే అతిపెద్ద కుంభకోణం..

Posted: 08/08/2017 05:36 PM IST
2 kinds of rs 500 rs 2000 notes congress alleges scam of the century

మన జేబులోని రూ.500 నోటు రెండు రకాలుగా ఉందా.. మనమే గుర్తించలేని విధంగా మార్పులు ఉన్నాయా.. ? అంటే అవునంటూ అరోపణలు గుప్పించింది కాంగ్రెస్. సాక్ష్యాత్తు పార్లమెంటులోని పెద్దల సభ (రాజ్యసభ)లో కాంగ్రెస్ ఎంపీలు ఇదే విషయమై ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. రాజ్యసభ కాంగ్రెస్ పక్ష నేత గులాం నబి అజాద్ మరో అడుగు ముందుకేసి దీనిని శతాబ్ధంలోనే అతిపెద్ద కుంభకోణమని కూడా వ్యాఖ్యానించారు. ఇలాంటి ఘటనలు దేశ చరిత్రలోనే ఇదే ప్రప్రధమని నోక్కి మరీ చెప్పారు. నోట్ల రద్దు తరువాత ఆర్బీఐ కొత్తగా ముద్రించి మార్కెట్ లోకి విడుదల చేసిన రూ.500, రూ.2000 నోట్లు డిజైన్లు, సైజుల్లోనూ తేడా ఉందని కాంగ్రెస్ నేతలు అరోపణలు గుప్పించారు.

రెండు వేర్వేరు సైజులు, డిజైన్లకు సంబంధించిన నోట్లను కూడా చూపించిన మాజీ కేంద్రమంత్రి కపిల్ సిబాల్.. రాజ్యసభలో ఈ అంశమై ప్రస్తావిస్తూ.. కేంద్రం తీసుకువచ్చిన కొత్త నోట్ల రెండు వేర్వేరు విధాలుగా ఎందుకు వుందని ప్రశ్నించారు. ఇలా చలామణిలో వున్న రెండు వేర్వేరు నోట్ల విషయాన్ని ఇటు కేంద్రం కానీ, అటు అర్బీఐ కానీ ఎందుకు ప్రజలకు తెలియజెప్పలేదని నిలదీశారు. ఈ విధంగా రెండు నోట్లు వుంటే.. దానిని అర్బీఐ ఎందుకని తమ వెబ్ సైట్ లో ప్రస్తావించలేదని కూడా కపిల్ సిబాల్ ప్రశ్నించారు. అసలు రెండు రకాలుగా 500 నోట్లను ముద్రించటం ఏందుకని ప్రభుత్వాన్ని నిలదీశారు.

తాము కూడా దేశాన్ని పరిపాలించామని, అయితే ఇలా ప్రభుత్వం కోసం ఒక నోటును, కేవలం పార్టీ నేతల కోసం మరో నోటును ఎన్నడూ ముద్రించలేదని అన్నారు. ప్రస్తుతం చలామణిలో వున్న రెండు పెద్ద నోట్లు రూ.500, రూ.2000 ఇలా వేర్వేరు సైజులు, డిజైన్లతో వున్నాయని, దేశం కోసం ముద్రించే నోట్లలో కూడా ఇంత తేడా ఎందుకని జరిగింది. ఎలా జరిగిందో చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేశాన్ని పాలిస్తున్న పార్టీలు ఇలా బాధ్యతారాహిత్యంగా ఎలా వ్యవహరిస్తున్నాయని కపిల్ సిబాల్ ప్రశ్నించారు. కాగా, ఇది దేశంలోనే అతి పెద్ద స్కాం అంటూ మరో కాంగ్రెస్ నేత గులాంనబీ అజాద్ సభలో నినాదాలు చేశారు. ఆయనకు మద్దతుగా విపక్షాలకు చెందిన పార్టీలన్నీ స్వరం కలిపాయి.

జీరో హ‌వ‌ర్లో ఎన్నో ముఖ్య‌మైన అంశాల‌పై చ‌ర్చించాల్సి ఉన్నా.. కాంగ్రెస్ మాత్రం క‌రెన్సీ నోట్లపై బాధ్య‌తారాహిత్య ప్ర‌క‌ట‌న చేస్తున్న‌ద‌ని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ విమ‌ర్శించారే తప్ప.. కాంగ్రెస్ నేతల ప్రశ్నలపై సమాధానాన్ని ఇవ్వలేక పోయారు. దీంతో కాంగ్రెస్ నేత‌లంతా స‌భ‌లో ఆందోళ‌న చేశారు. తృణ‌మూల్ కాంగ్రెస్ నేత డెరెక్ ఓబ్రైన్ కూడా కాంగ్రెస్ లేవ‌నెత్తిన అంశాన్ని స‌మ‌ర్థించారు. ఇది చాలా సీరియ‌స్ అంశ‌మ‌ని ఓబ్రైన్ అన్నారు. జేడీయుకి చెందిన ఎంపీలతో పాటు విపక్ష సభ్యులందరూ ఈ అంశంపై కేంద్రాన్ని నిలదీశారు. దీంతో సభలో గంధరగోళం ఏర్పడింది. పది నిమిషాల వాయిదా అనంతరం సభ మళ్లీ ప్రారంభమైన ఏ మాత్రం మార్పు కనిపించకపోవడంతో.. సభను డిఫ్యూటీ చైర్మన్ కురియన్ బుధవారానికి వాయిదా వేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rs 500  two types  RBI  Rajya Sabha  Kapil Sibal  scam of the century  Arun Jaitley  demonetisation  

Other Articles