Rahul violated security protocol a 100 times, says Rajnath ..అందుకనే రాహుల్ గాంధీ కారుపై దాడి: కేంద్రం

No security abroad what s he hiding rajnath singh s jab at rahul gandhi

SPG, Rahul Gandhi, Gujarat, Flood affected areas, black flags, stone pelting incidents, Rajnath Singh, Bharatiya Janata Party, Lok Sabha, Mallikarjun Kharge, House, Jammu, Lok Sabha, IPC

Responding to Congress leader Mallikarjun Kharge's allegation that last week's stone pelting incident in Gujarat could have killed Rahul, Singh said the Congress vice president has violated the security protocol on several occasions in India and abroad.

..అందుకనే రాహుల్ గాంధీ కారుపై దాడి: కేంద్రం

Posted: 08/08/2017 04:05 PM IST
No security abroad what s he hiding rajnath singh s jab at rahul gandhi

గుజరాత్ వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు వెళ్లిన కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీపై దాడి జ‌రిగిన అంశాన్ని ఆ పార్టీ నేతలు ఇవాళ లోక్ సభలో ప్రస్తావించారు. గుజరాత్ లో పరామర్శకు వెళ్లిన తమ నేతపై అక్కడి నేతలు దాడులకు తెగబడటం.. ఆయన కారును ధ్వంసాన్ని చేయడంపై నిలదీశారు. ప్రతిపక్ష నేతలు భద్రత కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని కాంగ్రెస్ లోక్సభ పక్ష నేత మల్లిఖార్జున్ ఖార్గే మండిపడ్డారు. క‌శ్మీర్‌లో ఉగ్ర‌వాదులు రాళ్లు రువ్వుతున్నార‌ని ప్ర‌భుత్వం అంటోంది, మ‌రి గుజ‌రాత్‌లో ఎవ‌రు రాళ్లు రువ్వారో చెప్పాల‌ని ఆయన ప్ర‌శ్నించారు. అయితే ఈ విమర్శలపై స్పందించిన కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ బుల్లెట్ ప్రూఫ్ కారు వాడ‌క‌పోవ‌డం వ‌ల్లే ఈ దాడి జరిగిందని అన్నారు.

రాహుల్ గాంధీ ప‌ర్య‌ట‌న గురించి రెండు రోజుల ముందే గుజ‌రాత్ పోలీసుల‌కు షెడ్యూల్ అందింద‌ని చెప్పారు. అయితే రాహుల్ గాంధీ ఎస్‌పీజీ ర‌క్ష‌ణ‌లో ఉన్నార‌ని సమాచారంతో గుజరాత్ పోలీసులు ఆయన ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా భారీ బందోబ‌స్తు చేశార‌ని కూడా చెప్పారు. రాహుల్ కోసం బుల్లెట్ ప్రూఫ్ కారును కూడా ఏర్పాటు చేశారని తెలిపారు. అయితే బుల్లెట్ ప్రూఫ్ లేని కారులో రాహుల్ ప్రయాణం చేయడం వల్లే ఈ సంఘటన చోటుచేసుకుందని, అలా కాకుండా బుల్లెట్ ఫ్రూఫ్ కారులో వెళ్లింటే దాడి జరిగేది కాదని అన్నారు.

ఎస్‌పీజీ సిబ్బందికి చెందిన డ్రైవ‌ర్ కారును న‌డిపార‌ని, అయితే తన షెడ్యూలు ప్రకారం కాకుండా రాహుల్ మార్గమధ్యంలో అనేక ప్రాంతాల్లో కారు ఆపార‌ని, అది షెడ్యూల్లో లేద‌ని చెప్పారు. కాగా, హెలిపాడ్ కు వెళ్తోన్న స‌మ‌యంలో ఓ గుర్తు తెలియ‌ని వ్య‌క్తి రాయితో దాడి చేశారని, సదరు వ్యక్తిని పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారని రాజ్ నాథ్ చెప్పారు. రాహుల్ బుల్లెట్ ఫ్రూప్ కారు తీసుకుని వెళ్లి ఉంటే ఈ ఘ‌ట‌న జ‌రిగేది కాదు అని రాజ్‌నాథ్ అన్నారు. సెక్యూర్టీ ప్రోటోకాల్ ను రాహుల్ ఉల్లంఘించార‌ని ఆరోపించారు.

ఎన్నో సార్లు రాహుల్‌కు ఈ విష‌యం గురించి చెప్పినా, ఆయ‌న ప‌ట్టించుకోలేదు అని రాజ్ నాథ్ తెలిపారు. అయితే రాజ్ నాథ్ సింగ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. బుల్లెట్ ఫ్రూప్ కారును రాహుల్ వినియోగించి వుంటే ఘటన జరగదన్న వారు తోసిపుచ్చుతున్నారు. జరిగిన ఘటనకు కేవలం ఒక్క వ్యక్తిని మాత్రమే బాధ్యుడ్ని చేసి మిగతా అర్ఎస్ఎస్, బీజేపి శ్రేణులను పార్టీ వర్గాలు కాపాడాలని చూస్తున్నాయని విమర్శిస్తున్నారు. రాయి విసిరేంత అవసరం ఎందుకు వచ్చిందో చెప్పాలని ప్రశ్నిస్తుంటే.. కేంద్ర ప్రభుత్వం దాటవేతధోరణితో సమాధానాలు చెబుతుందని విమర్శిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : SPG  Rahul Gandhi  Gujarat  stone pelting incidents  Rajnath Singh  Mallikarjun Kharge  Lok Sabha  

Other Articles