రైలు..ఫ్లాట్ ఫామ్ మధ్యలో ఇరుక్కుపోయాడు.. తోటి ప్రయాణికులు ఎలా కాపాడారో చూడండి | commuters push train to free man stuck on platform

Beijing commuters rescue trapped man on platform

Passengers pushed Train, Beijing Man Save, Man Struck Train Platform, Train Passengers Save Life, Train Push Video, Passengers Save, Dongzhimen station Video, Dongzhimen station Passengers, Dongzhimen station Train Video, Passenger Rescue Video

People power saves Chinese man crushed between subway train and safety barrier. According to Channel News Asia The passengers pushed the train at Beijing's Dongzhimen station on August 3, after the staff members' initial attempts to free the man faile. A 56-second video clip was captured when it took place.

ITEMVIDEOS:ట్రెయిన్ నే తోసేసి మరి కాపాడారు

Posted: 08/05/2017 08:04 AM IST
Beijing commuters rescue trapped man on platform

కని విని ఎరుగని ఓ అరుదైన ఘటన చైనా రాజధాని బీజింగ్ లో చోటు చేసుకుంది. రైలుకు, ప్లాట్‌ఫామ్‌కు మధ్య ఉన్న సందులో ప్రమాదవశాత్తూ ఇరుక్కుపోయాడు ఓ వ్యక్తి. అతన్ని కాపాడే యత్నంలో కాస్త అటు ఇటు అయితే ప్రాణాలు పోవటం ఖాయం. అలాంటిది ఆ వ్యక్తి కోసం అక్కడున్న వాళ్లంతా కలిసి చేసిన యత్నంపై ప్రశంసలు కురుస్తున్నాయి.

వేగంగా రైలు వస్తున్న సయమంలో ఓ వ్యక్తి అక్కడున్న సేఫ్టీ బారికేడ్లను దూకేశాడు. డ్రైవర్ సడన్ బ్రేకులు వేయటంతో ఓ వ్యక్తి రైలుకు, ఫ్లాట్ ఫామ్ కు మధ్యలో ఇరుక్కుపోయాడు. వెంటనే రంగంలోకి దిగిన రైల్వే సిబ్బంది అతని ప్రాణాలు కాపాడే యత్నం చేసింది. అయితే అది విఫలం కావటంతో అక్కడున్న ప్రయాణికులంతా కలిసి తలా ఒక చేయి వేశారు. ఏదో కారో, బస్సునో నెట్టినంత ఈజీ కాదు కదా.

 

అందుకే ఒకటి.. రెండు.. మూడు.. అంటూ బలంగా ముందుకు నెట్టి విజయం సాధించారు. అతనెందుకు దూకాడో కారణం తెలీనప్పటికీ మొత్తానికి ప్రాణాలతో బయటపడ్డాడు. గురువారం ఈ ఘటన జరగ్గా సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. బీజింగ్‌లోని డోంగ్‌ఝిమెన్ స్టేషన్‌లో జరిగిందీ ఘటన.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : China  Train Push Video  Passengers Save  

Other Articles