Jagan not Invite TDP MLC into YSRCP

Shilpa chakrapani join in ycp suspense continues

Shilpa Chakrapani Reddy, Shilpa Chakrapani Reddy YSRCP, Shilpa Chakrapani Reddy Continues TDP, Shilpa Chakrapani Reddy Srisailam Ticket, Shilpa Chakrapani Reddy Put Conditions, Shilpa Chakrapani Reddy Jagan, Jagan Not Invite Chakrapani Reddy, TDP MLC Join YSRCP, Shilpa Not Quit TDP, CHakrapani Reddy in TDP

MLC Shilpa Chakrapani Reddy To Quits TDP after brother, Nandyal By Election Candidate Shilpa Mohan Reddy Meet him. But, he put condition TDP to continue in party as promise Srisailam Ticket to him in Upcoming Elections.

వైసీపీలోకి శిల్పా చక్రపాణి.. హోల్డన్

Posted: 08/01/2017 11:06 AM IST
Shilpa chakrapani join in ycp suspense continues

టీడీపీ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి కూడా వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధమైనట్టు వస్తున్న వార్తలు కలకలం రేపుతున్నాయి. నంద్యాల బైపోల్ లో తనకే మద్ధుతు ఇవ్వాలంటూ సోదరుడు హోహన్ రెడ్డి కోరటం, ఆ వెంటనే కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యేందుకు చక్రపాణి సిద్ధపడిపోతుండటంతో దాదాపు చేరిక ఖాయమైందనే చెప్పుకున్నారు. అయితే ఈ విషయమై ఇంకా అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.

గత కొన్ని రోజులుగా పార్టీ కార్యాకలాపాలకు చక్రపాణి దూరంగా ఉంటూ వస్తున్నారు. తన అన్న మోహన్ రెడ్డిని వైసీపీలో చేరకుండా ఆపడంలో విఫలమయ్యారని పలువురు తెలుగుదేశం నేతలు శిల్పా చక్రపాణిరెడ్డిపై బహిరంగంగానే విమర్శనాస్త్రాలు సంధించారు. చంద్రబాబు నంద్యాల పర్యటనలోనూ ఈ ఎమ్మెల్సీ దూరంగానే ఉంటూ వస్తున్నారు. దీంతో 3వ జగన్ నంద్యాల టూర్ లో కండువా పుచ్చుకునేందుకు చక్రపాణి రెడీ అయిపోయాడనే సంకేతాలు అందాయి.

కానీ, ఆ పార్టీ నాయకుల నుంచి తనకు ఆహ్వానం అందిన మాట నిజమేనని, ఇంకా జగన్ నుంచి మాత్రం ఎలాంటి పిలుపు రాలేదని చక్రపాణి స్పష్టం చేశాడు. తెలుగుదేశం హైకమాండ్, ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన వారికి ప్రాధాన్యమిస్తూ, తనవంటి వారిని పట్టించుకోవడం లేదని విమర్శించిన ఆయన, పలు అధికారిక కార్యక్రమాలకు కూడా తనను ఆహ్వానించడం లేదని వాపోయారు. సుదీర్ఘకాలంగా తన వెంట నడుస్తున్న కార్యకర్తల మనోభావాలను తెలుసుకోనున్నానని, వారితో సమావేశం తరువాత తుది నిర్ణయం తీసుకుంటానని ఆయన తెలిపారు.

ఇంకోపక్క రాజకీయ భవితవ్యంపై కూడా మంతనాలు చేస్తున్నట్లు వార్తలు అందుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో శ్రీశైలం అసెంబ్లీ సీటు గ్యారెంటీగా ఇస్తామని చెబితేనే తెలుగుదేశం పార్టీలో కొనసాగుతానని, లేకుంటే రాజీనామా చేసి వైకాపాలోకి వెళ్లడం మినహా మరో మార్గం కనిపించడం లేదని ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి, తనను బుజ్జగించేందుకు వచ్చిన ఎంపీ సీఎం రమేష్, జిల్లా ఇన్ చార్జ్ మంత్రి కాల్వ శ్రీనివాసులుకు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TDP MLC  Shilpa Chakrapani Reddy  YSRCP  YS Jagan  

Other Articles