A survey finds Men 'forced into sex by women రివర్స్ రేప్: మగాడిపై మహిళల అత్యాచారం

Uk research founds women raping men in britain

united kingdom, forced to penetrate, women raping men, lancaster university, strategies, blackmail, threats, verbal abuse, spreading rumours, threats, end relationships, lancaster university,law school, sexual violence by women, sexual opportunities

Research at Lancaster University reveals many men have been forced by women to penetrate them using various strategies, including blackmail, threats, lies and verbal abuse.

రివర్స్ రేప్: మగాడిపై మహిళల అత్యాచారం

Posted: 07/31/2017 01:12 PM IST
Uk research founds women raping men in britain

రవి అస్తమించిన సామ్రాజ్యంలో ఇప్పుడు కొత్త నేరాల సంఖ్య పెరుగుకు పోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మహిళలపై పురుషులు లైంగికదాడులకు పాల్పడుతుండగా, యైనైటెడ్ కింగ్ డమ్ లో మాత్రం మహిళల లైంగికదాడుల సంఖ్య అంతకంతకూ పెరుగుకుపోతుంది. దీనిని ఫోర్సుడ్ టు పెనిట్రేట్ గా అభివర్ణిస్తున్న క్రమంలో అంతకంతకూ పెరుగుతున్న ఈ నేరాలపై తాజాగా ల్యాంకస్టెర్‌ యూనివర్సిటీ లా స్కూలుకు చెందిన విద్యార్థులు జరిపిన అధ్యయనంలో పలు విషయాలు వెలుగుచూశాయి.

బ్రిటన్‌లో మహిళలు రహస్యంగా పురుషులపై బలవంతంగా శృంగారానికి పాల్పడుతున్నారని.. సరిగ్గా పురుషులు మహిళలను పలు కేసుల్లో బెదరించినట్లుగానే మహిళలు కూడా బ్లాక్‌మెయిల్‌ చేయడం, బెదిరించడం, దూషించడం, వదంతులు ప్రచారం చేయడం, మీ అనుబంధాల్లో చిచ్చు పెడతామని హెచ్చరించడం వంటి పలు అనేక వ్యూహాలను అమలుచేస్తూ మహిళలు బలవంతంగా పురుషులపై అత్యాచారానికి ఒడిగడుతున్నారు. మహిళల చేత బలవంతంగా శృంగారంలోకి దిగుతున్న పురుషుల సంఖ్య చాలానే వుందని ఈ అధ్యయనంలో తేలింది.

కొన్ని సందర్భాల్లో మహిళలు పురుషులపై బలప్రయోగం కూడా చేస్తున్నారని, అవసరమైన క్రమంలో ఆయుధాన్ని కూడా ఉపయోగించి మరీ పురుషులపై లైంగికదాడులకు పాల్పడుతున్నారని తమ అథ్యయనంలో తేలినట్లు యూనివర్సిటీ విద్యార్థుల నివేదిక స్పష్టం చేసింది. సమ్మతి లేకుండా డ్రగ్స్‌ ఇవ్వడం కూడా ఇలాంటి వ్యూహాల్లో భాగంగా ఉందని యూనివర్సిటీ పేర్కొంది. అయితే పురుషులపై మహిళలు జరిపే అకృత్యాలను అత్యాచారంగా పరిగణించని బ్రిటెన్ చట్టాలు.. ఇలాంటి ఘటనలు వేరుగా పరిశీలిస్తున్నాయి. పురుషులపై అత్యాచారం గురించి ఇలాంటి అధ్యయనం నిర్వహించడం ఇదే తొలిసారి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : united kingdom  forced to penetrate  women raping men  lancaster university  

Other Articles