ఓవైపు సిట్ ఎంక్వైరీ.. ఇంకోవైపు 600 కేజీల డ్రగ్స్ స్వాధీనం | Telangana Excise IB Busted Huge Racket

Huge drug racket busted in telangana

Directorate of Revenue Intelligence, Telangana IB Raids, Telangana IB Huge Drug Racket, DRI Drug Racket, Alprazolam Telangana Drug, Artificial Drug Telangana

the Directorate of Revenue Intelligence (DRI) conducted raids at four different locations in Telangana including Medak and Nalgonda districts and seized Alprazolam, worth Rs 5 crore. The drug was being manufactured illegally, and four persons were taken into custody in connection with the case, officials said.

డ్రగ్స్ కేసులో మరో సంచలనం

Posted: 07/29/2017 08:30 AM IST
Huge drug racket busted in telangana

తెలుగు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్న డ్రగ్స్ వ్యవహారంలో కొత్త ట్విస్ట్. ఓవైపు తెలంగాణలో డ్రగ్స్ మూలాలు మొగ్గ దశలోనే ఉన్నాయంటూ స్వయంగా సీఎం కేసీఆర్ ప్రకటించగా, భారీ మొత్తంలో గుట్టును ఇంటలిజెన్స్ బ్యూరో రట్టు చేసింది. ఈ క్రమంలో నలుగురు కీలక వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

మెదక్, నల్గొండ, జిల్లాల్లోని నాలుగు ప్రాంతాల్లో సోదాలు జరిపిన డైరెక్టరేట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు ఏకంగా 600 కేజీల మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.5 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా నిందితుల నుంచి పలు షాకింగ్ విషయాలే వెల్లడైనట్లు సమాచారం. అల్పజోరమ్ అని పిలిచే ఈ డ్రగ్ ను కల్లుతో కలిపి అలవాటు చేస్తుంటారు. కాగా, తెలంగాణలో ఇంత పెద్దమొత్తంలో డ్రగ్స్‌ పట్టుబడటం ఇదే తొలిసారి. వాటిని ల్యాబ్‌లలో తయారుచేసినట్టు అధికారులు గుర్తించారు. ల్యాబ్‌లు ఏవైనా ప్రముఖ సంస్థలకు చెందినవా? లేక ప్రత్యేకంగా ఏర్పాటు చేశారా? అన్నది తేలాల్సి ఉంది.

ఓవైపు డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని ఓ వైపు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారిస్తుంటే, మరోవైపు కేంద్ర ఇంటెలిజిన్స్ సంస్థ శుక్రవారం చడీచప్పుడు కాకుండా మరో భారీ డ్రగ్ రాకెట్ ముఠాను అరెస్ట్ చేయటం సంచలనంగా మారింది. డ్రగ్స్, గుడుంబా వ్యాపారాలపై సమాచారమిస్తే లక్ష రూపాయల నజరానాను తెలంగాణ ముఖ్యమంత్రి ప్రకటించిన కాసేపటికే ఈ అరెస్ట్ వార్త మీడియాలో రావటం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  Drug Racket  Directorate of Revenue Intelligence  

Other Articles