ED One more attachment in Jagan Case

Assets of nimmagadda attached

Jagan Money Laundering Case, Jagan Case ED Attachment, ED Attaches Jagan Assets, Nimmagadda Lands ED, Enforcement Directorate Attaches

YS Jagan Money Laundering Case. Enforcement Directorate Attached Nimmagadda Prasad's Lands.

జగన్ అక్రమాస్తుల కేసులో మరో అటాచ్

Posted: 07/28/2017 01:55 PM IST
Assets of nimmagadda attached

వైకాపా అధినేత వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఎన్ ఫోర్స్ డిపార్ట్ మెంట్ మరో అటాచ్ మెంట్ చేసేసింది. ఈ కేసులో జగన్ తోపాటు ఆరోపణలు ఎదుర్కుంటున్ననిమ్మగడ్డ ప్రసాద్ కు చెందిన భూములను అటాచ్ చేస్తున్నట్టు ఈడీ కొద్దిసేపటి క్రితం ప్రకటించింది.

మొత్తం రూ. 148.9 కోట్ల విలువైన భూములను ఆటాచ్ చేస్తున్నామని, ఈ కేసులో నిమ్మగడ్డ ప్రమేయంపై పూర్తి ఆధారాలను సేకరించిన తరువాతనే ఈ నిర్ణయం తీసుకున్నామని ఈ సందర్భంగా ఈడీ తెలిపింది. ఈ విషయమై పూర్తి సమాచారం వెలువడాల్సి ఉంది. 

Nimmagadda Satyanarayana Assets ED Attach

మ్యాట్రిక్స్‌ ప్రసాద్‌గా పేరు పొందిన నిమ్మగడ్డ ప్రసాద్‌ రియల్‌ ఎస్టేట్‌తో వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత 2000 సంవత్సరంలో ఖాయిలాపడిన హెర్రెన్‌ డ్రగ్స్‌ను కొనుగోలు చేసి మ్యాట్రిక్స్‌ ఫార్మాస్యుటికల్స్‌గా పేరు మార్చి లాభాలబాట పట్టించారు. 2006లో అమెరికా ఫార్మా కంపెనీ మైలాన్‌ లేబొరేటరీస్‌కు మ్యాట్రిక్స్‌ను విక్రయించి పెద్ద ఎత్తున లాభాలను గడించారు.  నిజాంపట్నం మధ్య పారిశ్రామిక కారిడార్‌ (వాన్‌పిక్‌ ప్రాజెక్ట్‌) కోసం 2008 జనవరిలో రాక్‌ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీతో ఒప్పందం కుదుర్చుకుని మ్యాట్రిక్స్‌ ఎన్‌పోర్ట్‌ హోల్డింగ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ స్థాపించారు. ఈ తరుణంలోనే ప్రసాద్‌ జగన్‌ కంపెనీల్లో 854 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టి అక్రమ ఆస్తుల కేసులో అరెస్టయ్యారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : YS Jagan  Nimmagadda Prasad  Money Laundering Case  

Other Articles