Mudragada Padmanabham Padayatra Stopped

Mudragada padayatra stopped by police

Mudragada Padmanabham, Kapu Reservation, Mudragada Padmanabham Padayatra, Chalo Amaravati Padayatra, Mudragada House Arrest, Chalo Amaravati Kirlampudi, Kirlampudi High Tension, Kirlampudi Police Posts, Mudragada Padayatra Break

Kapu Leader Mudragada Padmanabham Chalo Amaravati Padayatra Stopped. High Police Security at Mudragada House and Kirlampudi.

హై టెన్షన్: ముద్రగడకు నడకకు బ్రేక్!

Posted: 07/26/2017 10:20 AM IST
Mudragada padayatra stopped by police

కాపు రిజర్వేషన్ల అంశం చివరిపోరాటంగా పేర్కొంటూ చలో అమరావతి పేరిట మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తలపెట్టిన విషయం తెలిసిందే. నాలుగు రోజులగా కిర్లంపూడిని, ముద్రగడ ఇంటిని, టోటల్ గా తూర్పుగోదావరి జిల్లానే తమ అదుపులోకి తీసేసుకుంది పోలీస్ యంత్రాగం. అనుమతి లేదంటూ మొదటి నుంచి మంత్రులు, డీజీపీ చెబుతూనే ఉన్నారు. అయినా మొండిపట్టుతో ఉన్న ముద్రగడ అన్న మాట ప్రకారం కాసేపటి క్రితం ఇంటి బయటకు వచ్చాడు.

అయితే ఆయన గేటు కూడా దాటకముందే పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ముద్రగడ, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తనను పాదయాత్రకు వెళ్లనివ్వాల్సిందేనని ఆయన పట్టుబడుతున్నారు. పోలీసులు మాత్రం, ర్యాలీకి, పాదయాత్రలకు ఈ ప్రాంతంలో అనుమతులు లేనందున, బయటకు అడుగుపెట్టనివ్వబోమని స్పష్టం చేస్తున్న పరిస్థితి. ఇక ముద్రగడకు మద్దతుగా వందలాది మంది కిర్లంపూడి వాసులు తరలిరావడంతో, పోలీసులు వారిని చెదరగొడుతున్నారు.

తన హక్కులను కాలరాస్తున్నారంటూ ఈ సందర్భంగా ఆయన పోలీసులపై మండిపడుతున్నాడు. ముద్రగడ మాట వినకుంటే, అరెస్ట్ చేసి కాకినాడకు తరలించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. కిర్లంపూడి, అమలాపురం ప్రాంతాల్లో గట్టి బందోబస్తును నిర్వహిస్తూ, అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరినీ ప్రశ్నిస్తున్నారు. జిల్లాతో వ్యాప్తంగా 144 సెక్షన్ అమలవుతోంది. పాదయాత్రలో పాల్గొంటే కేసులు తప్పవని హెచ్చరించినప్పటికీ పెద్ద ఎత్తునే మద్ధతుదారులు రావటం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chalo Amaravati  Mudragada Padmanabham  Padayatra  

Other Articles