ముద్రగడ యాత్ర ఎఫెక్ట్. ఎటు చూసినా సీసీ కెమెరాలు.. ఖాకీ బూట్ల చప్పుళ్లే... | Metal Detectors CC cameras appears in Kirlampudi

High technology in kirlampudi over mudragada yatra

Mudragada Padmanabham, Kirlampudi, Police Deployed Mudragda Yatra, Mudragada Padmanabham Padayatra, AP Govt Restrictions Padayatra, Mudragada Yatra Under Siege, CC Cameras Drones Kirlampudi, East Godavari Police Personals

Tight security in Kirlampudi Village as kapu leader Mudragada Padmanabham gears up for Chalo Amaravati. Four DSPs have been posted on the four roads leading to the Kapu leader’s house. Police pickets have been deployed from National Highway-16. Closed circuit cameras have been fixed on electricity poles in front of Mr. Padmanabham’s house and police also using drone cameras in the street.

టెక్నాలజీతో ముద్రగడ యాత్రకు చెక్!

Posted: 07/24/2017 11:25 AM IST
High technology in kirlampudi over mudragada yatra

చలో అమరావతి పేరిట కాపు కాపరి ముద్రగడ పద్మనాభం తలపెట్టబోతున్న పాదయాత్రకు అనుమతి నిరాకరణ ద్వారా ఏపీ ప్రభుత్వం మరిన్ని విమర్శలను మూటగట్టుకుంటోంది. మరోవైపు పోలీసులు కూడా దీనిని అడ్డుకునేందుకు దారులన్నీ మూసేస్తున్నారు. ఇందుకోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడేస్తున్నారు. కిర్లంపూడి నుంచి యాత్ర ప్రారంభం కావాల్సి వుండగా, ఊరు మొత్తాన్నీ తమ గుప్పిట్లోకి తీసుకున్న పోలీసులు డ్రోన్ కెమెరాలతో ప్రతి వీధిపై నిఘా పెట్టారు.

జిల్లా వ్యాప్తంగా సెక్షన్ 30 అమలులో పెట్టిన అధికారులు గుర్తింపు కార్డులు ఉంటేనే గ్రామంలోకి అనుమతిస్తున్నారు. ఎవరు బయటకు వస్తున్నారు? ఎవరు ఎక్కడికి పోతున్నారు? ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు? వంటి వివరాలన్నీ సేకరిస్తున్నారు. ఇక్కడ కాపలా కాస్తున్న పోలీసులు బాడీ కెమెరాలను ధరించి తిరుగుతూ, అనుమానం వచ్చిన వారిని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే కాపు వర్గం నేతలపై బైండోవర్ కేసులు పెట్టిన పోలీసులు, ముద్రగడను హౌస్ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సుమారు 3 వేల మంది పోలీసులు తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా మోహరించారు.

పాదయాత్రను అడ్డుకోవడమే లక్ష్యంగా ఈ నెల 26 వరకూ 144 సెక్షన్ విధించిన పోలీసులు, ఏ నలుగురూ కూడా కలసి నడిచేందుకు కూడా అనుమతించడం లేదు. కిర్లంపూడికి దారితీసే అన్ని మార్గాలనూ మూసేసిన పోలీసులు, గుర్తింపు కార్డులను చూపిన వారిని మాత్రమే ఊరిలోకి అనుమతిస్తున్న పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో తన పాదయాత్ర జరిగి తీరుతుందని ముద్రగడ ప్రకటించడంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అఫిడవిట్ సమర్పించి మరీ ఇబ్బందులను కొనితెచ్చుకున్నట్లే అవుతుందన్న ఉద్దేశ్యంతోనే ముద్రగడ కూడా అనుమతి కోరేందుకు ముందకు రావట్లేదని సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mudragada Padmanabham  Chalo Amaravati Padayatra  AP Govt  

Other Articles