ఒప్పొ నోటిదూల.. ఇండియన్స్ అడుక్కుతినేవాళ్లంట! | Chinese Boss Calls Indians Are Beggars

Oppo official controversy comments on indians

Oppo, Oppo Controversy, Oppo Beggars Are India, Indians Are Beggars Comments, Punjab Oppo Staff, Oppo India Controversy, China Oppo Controversy

Chinese manufacturer Oppo landed itself in hot water in India earlier this week after a post on social media alleging one of its employees had said "Indians are beggars" went viral. The post, said to be by the company's service team in Punjab, also said that all employees in the team had tendered their resignation. The company, however, says now that the management team and the service team have reached a settlement and no one would be leaving.

కాంట్రవర్సీ: ఇండియన్స్ ఆర్ బెగ్గర్స్

Posted: 07/21/2017 11:33 AM IST
Oppo official controversy comments on indians

స్మార్ట్ ఫోన్ల అమ్మకాలలో ప్రస్తుతం టాప్ లిస్ట్ లో ఉన్న 'ఒప్పొ'కి గడ్డుకాలం వచ్చిపడింది. చైనా కేంద్రంగా ఉన్న ఈ కంపెనీ కి చెందిన ఓ ఉన్నత ఉద్యోగి భారతీయులను అవమానించటంపై సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేగగా, సెల్ ఫోన్ల అమ్మకాలు ఒక్కసారిగా పడిపోయాయి. దీంతో రంగంలోకి దిగిన యాజమాన్యం పరిస్థితిని చక్కదిద్దడానికి నానా ఆగచాట్లు పడుతోంది.

ఒప్పొ పంజాబ్ కార్యాలయంలో పని చేస్తున్న చైనా ఉద్యోగుల టీమ్ లోని అధికారి ఒకరు 'భారతీయులు అడుక్కుతినేవారు' అని వ్యాఖ్యానించినట్టు ఓ న్యూస్ వైరల్ అయింది. సర్వీస్ టీమ్ లో మేనేజర్ గా పని చేస్తున్న అరుణ్ శర్మ అనే ఉద్యోగిని టార్గెట్ చేస్తూ.. ‘‘ఇండియన్స్ కు కల్చర్ లేదని, భారతీయులు డబ్బు కోసమే పని చేస్తారని, డబ్బుల కోసం అడుక్కుంటారని’’ సదరు చైనా అధికారి వ్యాఖ్యానించినట్టు విషయం బయటకు పొక్కింది. ఈ విషయాన్ని అరుణ్ శర్మ, ఓ లేఖ ద్వారా మీడియాకు కూడా చేరవేశాడు.

ఈ నేపథ్యంలో ఫేస్ బుక్, ట్వి్ట్టర్ లో ఒప్పో ఫోన్లను కొనుగోలు చేయవద్దన్న ప్రచారం జోరుగా సాగగా, అమ్మకాలు తగ్గాయి. దీంతో రంగంలోకి దిగిన యాజమాన్యం చైనా టీంతో రాజీనామా చేయించినట్లు సమాచారం. అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, తప్పు చేసిన అధికారిపై చర్యలుంటాయని ఒప్పొ ఓ ప్రకటనలో పేర్కొంది. గతంలో నోయిడా కార్యాయలం సిబ్బంది జాతీయ పతాకాన్ని చించి అవమానించటం పెను దుమారమే రేపగా, ఒప్పో ఆ సిబ్బందిపై వేటు వేసింది కూడా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Oppo  Controversy Comments  Indians  

Other Articles

Today on Telugu Wishesh