Former Chinese diplomat gives India 3 options on Doklam భారత్ ఆర్మీపై చైనా మాజీ రాయబారి కవ్వింపు కూతలు..

Former chinese diplomat gives india 3 options on doklam

China, Tibet, Peoples Liberation Army, china former diplomat, Liu Youfa, Dokalam, Sikkim, Bhutan, Tibet, War, army, army vehicles, army ammunition, indian military, South China Morning Post, People’s Liberation Army (PLA) Daily, military equiments, border tension

A former Chinese diplomat said that Indian troops faced three options at Doklam as the stand-off entered one month: withdrawal, capture or an attack by China "should the dispute escalate".

భారత్ ఆర్మీపై చైనా మాజీ రాయబారి కవ్వింపు కూతలు..

Posted: 07/20/2017 03:18 PM IST
Former chinese diplomat gives india 3 options on doklam

భారత్ తలుచుకుంటే ఏం చేయగలుగుతుందో అగ్రరాజ్యం అమెరికా డ్రాగన్ దేశానికి వివరించిన తరువాత కూడా.. చైనాకు చెందిన మాజీ దౌత్యాధికారులు, మీడియా ముఖంగా నిసిగ్గుగా కవ్వింపు కూతలకు తెగబడుతున్నారు. ఓ వైపు తమ దేశ జాతీయవాదాన్ని హైజాక్ చేశారంటూనే.. ఇక హైందవ వాదాన్ని తెరపైకి తీసుకువస్తే.. యుద్దం జరుగకుండా ఎవరూ అపలేరని హెచ్చరికలు చేస్తూనే వుంది. ఇప్పటికీ శాంతియుత వాతావరణంలో డొక్లోం సమస్యపై చర్చించుకుందామని భారత్ విన్నవిస్తున్నా.. వెనక్కు తగ్గని చైనా.. ఓ వైవు భారీ సంఖ్యలో సైనికులను, యుద్ద సామాగ్రిని, యుద్దవాహనాలను టిబెట్ కు తరలించి.. మరోవైపు మీడియా ముఖ్యంగా యుద్దం తప్పదన్న సంకేతాలను పంపుతూ కవ్వింపు రాతలకు పూనుకుంటుంది.

ముంబైలో చైనా కౌన్సెల్‌ జనలర్‌గా పనిచేసిన మాజీ రాయబారి, విదేశీ వ్యవహారాల నిపుణుడు లియు యౌఫా చైనా తాజాగా మీడియాలో కారుకూతలు కూశాడు. సిక్కిం రాష్ట్రంలోని భారత్ చైనా సరిహద్దులో గల డొక్లాంలో వున్న భారత్ అర్మీకి వేరే గత్యంతరం లేదని, కేవలం మూడు అప్షన్లు మాత్రమే వున్నాయిన్నాడు. అవి ఒకటి వెనక్క వెళ్లడం, రెండు చైనా అర్మీకి బంధీలుగా మారడం, మూడు చైనా అర్మీ చేతిలో మరణించడం. ఇప్పటికే డొక్లాం ప్రాంతంలో భారత్‌-చైనా సైన్యాల మధ్య  ప్రతిష్టంభన కొనసాగుతుండగా, ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు మరింత కవ్విస్తున్నాయి.

'సైనిక దుస్తులు ధరించిన వ్యక్తులు మరొక దేశం భూభాగంలోకి ప్రవేశించారంటే.. వాళ్లు సహజంగానే శత్రువులు అవుతారు. అందుకు వారు మూడు పరిణామాలను ఎదుర్కొంటారు. ఒకటి స్వచ్ఛందంగా వెనుకకు తగ్గడం, లేదా పట్టుబడటం.. అప్పటికీ సరిహద్దు వివాదం సమసిపోకపోతే.. ఆ సైనికులు చంపపడొచ్చు' అని ఆయన చెప్పుకొచ్చాడు. ఈ మూడు ఆప్షన్లలో భారత్ ఏది ఎంచుకుంటుందో చైనా వేచి చూస్తున్నదని, భారత్ అర్థవంతమైన సున్నితమైన ప్రత్యామ్నాయాన్ని ఎంచుకుంటుందని భావిస్తున్నామని యౌఫా చేసిన వ్యాఖ్యలు భారతీయుల రక్తాన్ని ఉడికిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : china  tibet  Indian army  china former diplomat  Liu Youfa  dokalam  sikkim  border tension  

Other Articles