Bizarre trend for Compensation in Pilibhit

Elderly sent to forests as tiger prey for compensation

Pilibhit Tiger Reserve, Pilibhit Tiger Deaths Mystery, Pilibhit Tiger Reserve Man Eaters, Elders prey for Tigers, Forest Tiger Deaths, No Tigers Killed Them, Poverty Tiger Kill

A bizarre trend is said to be afoot in villages bordering the Pilibhit Tiger Reserve (PTR) in Uttar Pradesh. Not Man Eaters Family Members sent their elders for tiger prey. After they get Compensation from Government.

పైసల కోసం పులులకు మేతగా...

Posted: 07/04/2017 09:47 AM IST
Elderly sent to forests as tiger prey for compensation

ఉత్తర ప్రదేశ్ లోని ఫిలిబిత్ లో దారుణం వెలుగు చూసింది. పేదరికంలో మగ్గిపోతున్న అక్కడి ప్రజలు ఎంతటి ఘోరానికి పాల్పడుతున్నారో ఆలస్యంగా వెలుగు చూసింది. ప్రభుత్వం నుంచి వచ్చే పరిహారం కోసం ఇంట్లో వృద్ధులను పులులకు ఆహారంగా వేస్తున్న ఘటన అధికారులను దిగ్భ్రాంతికి గురి చేసింది. నాటకీయ పరిణామాల మధ్య వెలుగు చూసిన ఈ ఉదంతం ఎలా వెలుగు చూసిందంటే...

ఫిలిబిత్ టైగర్ రిజర్వ్ (పీటీఆర్) చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసించే ప్రజలు తమకు రక్షణ కావాలంటూ గత ఆరు నెలలుగా ప్రభుత్వానికి విజ్నప్తి చేస్తున్నారు. పోలాలకు వెళ్తున్న తమ కుటుంబ సభ్యులపై దాడి చేసి చంపేస్తున్నాయంటూ మొత్తుకుంటున్నారు. ఫిబ్రవరి 16 నుంచి జూలై 1 దాకా దాదాపు 12 మంది పులుల మూలంగానే మృత్యువాత పడ్డారు. అయితే జూలై 1న మరణించిన మహిళ ఉదంతంలో అధికారులకు కొన్ని అనుమానాలు కలిగాయి. దీంతో వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో (డబ్ల్యూసీసీబీ) కు చెందిన అధికారి కలీమ్ అథర్ రంగంలోకి దిగి విచారణ ప్రారంభించాడు.

వృద్ధురాలు చనిపోయింది అటవీలో అయితే ట్రాక్టర్ ద్వారా లాక్కొచ్చి పొలంలో పడేసినట్లు గుర్తించాడు. అంతేకాదు ఆమె దుస్తులు కిలో మీటర్ న్నర ఎక్కడో అటవీ ప్రాంతంలో ఉండటం గమనించాడు. దీంతో కుటుంబ సభ్యులను గట్టిగా విచారించగా అసలు విషయం చెప్పేశారు. ఆ వృద్ధురాలిని అడవుల్లోని పులులకు తామే ఆహారంగా వేసేస్తున్నట్లు ఒప్పుకున్నారు. అయితే ఇది తమ ఒక్క ఇంట్లోనే జరగలేదని, ఇంతకు ముందు చనిపోయిన వారంతా ఇదే రీతిలో ప్రాణాలు కోల్పోయారని షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. ముందు పులులకు మేతగా వేశాక, అనంతరం వారి కళేబరాలను తెచ్చి పొలాల్లో పడేసి, పరిహారంగా ప్రభుత్వం నుంచి లక్షల రూపాయలు గుంజుతున్నారంట.

ఇందుకోసం ఆ కుటుంబాల్లోని వృద్ధులు స్వచ్ఛందంగా ముందుకు రావటమే ఇక్కడ గమనార్హం. పేదరికంలో కొట్టుమిట్టాడుతున్న కుటుంబాలను గట్టెక్కించేందుకు ఇది తప్ప మరో మార్గం లేదని పీటీఆర్ చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలు భావిస్తున్నట్టు జర్నైల్ సింగ్ (60) అనే స్థానికుడు చెప్పడం అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది. ఫారెస్ట్స్ కన్జర్వేటర్ వీకే సింగ్ ఈ అమానుషాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లి ఉపాధి కల్పించేలా చేస్తానని హామీ ఇవ్వటంతో ఈ మారణకాండకు ఫుల్ స్టాప్ పడ్డట్టేనని భావిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pilibhit  Reserve Forest  Tiger Deaths  Compensation  

Other Articles