India Deploy more Troops but Not War Purpose

Sikkim stand off india deploy army

India China Border, Assam Stand Off, India China Troops, India After China Statement, India Back troops, Sikkim Doka La Issue, Doka La India China Issue, Doka La Controversy, Bhutan Fear India China War, China Rocket Fail

India rushes more troops to Doka La in longest row with China since 1962 China asks India to recall troops from Sikkim's Doklam again. China's New Heavy-Lift Rocket Launch Fails.

55 ఏళ్ల తర్వాత సేమ్ సీన్.. టెన్షన్

Posted: 07/03/2017 11:41 AM IST
Sikkim stand off india deploy army

భూటాన్ తో చైనా వివాదం, సిక్కిం సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో భారత్ మరిన్ని బలగాలను మోహరిస్తోంది. యుద్ధ పద్ధతిలో కాకుండా బలగాలను తరలిస్తోంది. ప్రస్తుతం ఇక్కడ భారత్-చైనా సైనికులు ఎదురెదురుగా (స్టాండ్ ఆఫ్) నిల్చుని ఎవరూ ఎటూ కదలకుండా అప్రమత్తంగా ఉన్నారు. 1962 తర్వాత ఇదే అత్యంత సుదీర్ఘ స్టాండ్ ఆఫ్. 2013లో లడఖ్ డివిజన్‌లోని డౌలత్ బేగ్ ఓల్డీ వద్ద 21 రోజులపాటు స్టాండాఫ్ కొనసాగింది. అప్పట్లో చైనా దళాలు భారత్ భూభాగంలోకి 30 కిలోమీటర్ల ముందుకు చొచ్చుకొచ్చాయి. భారత్ బలగాలు రంగంలోకి దిగడంతో చైనా ఆర్మీ వెనక్కి తగ్గింది.

ప్రస్తుతం సిక్కిం రీజియన్‌లోని భారత్, చైనా, భూటాన్ సరిహద్దులో ఉన్న డోక్లా వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో భారత్ పెద్ద ఎత్తున బలగాలను తరలిస్తుండడం ప్రాధాన్యం
సంతరించుకుంది. 1962 యద్ధం తర్వాత భారత్ ఈ స్థాయిలో బలగాలను తరలించడం ఇదే తొలిసారి. అయితే గన్ నాజిల్‌ను కిందికి ఉంచడం ద్వారా తాము యుద్ధానికి రావడం లేదన్న
సంకేతాలను భారత్ ఆర్మీ పంపింది. అలాగే డోకా లా ప్రాంతంపై ఆధిపత్యం ద్వారా భారత-భూటాన్‌ సరిహద్దులను పరిశీలించడానికి చైనా ప్రయత్నిస్తోంది.

మరోవైపు.. సిక్కిం ప్రాంతంలో భారతదళాలే హద్దు దాటినట్లు చూపించడానికి చైనా ప్రయత్నాలు చేస్తోంది. తమ భూభాగంపై పూర్తి అధికారాలు తమవేనని, భారతదళాలే చొచ్చుకొచ్చాయని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధిలు కాంగ్‌ ఇటీవల వ్యాఖ్యానించారు. దానికితోడు తాజాగా డోకాలా ప్రాంతం తమ భూభాగంలోనిదే అని చూపించుకోడానికి కొత్త మ్యాప్‌లను విడుదల చేసింది. 2012లో ఇండియన్ ఆర్మీ ఇక్కడ ఏర్పాటు చేసిన రెండు బంకర్లను తొలగించాలని జూన్1న చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ భారత్‌ను కోరింది. అందుకు భారత్ నిరాకరించింది. దీంతో ఆ ప్రాంతం తమదేనని, భారత్‌కు కానీ, భూటాన్‌కు కానీ దానిపై హక్కులు లేవంటూ జూన్ 6న బుల్డోజర్లతో భారత్ బంకర్లను ధ్వంసం చేసింది.

దీంతో చైనా ఆగడాలను అడ్డుకునేందుకు ఇండియన్ ఆర్మీ రంగ ప్రవేశం చేసింది. సైనికులను మోహరించింది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాదాపు నెల రోజులుగా అక్కడ స్టాండాఫ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో భారత్ పెద్ద ఎత్తున బలగాలను తరలించడం చర్చనీయాంశమైంది. ఓవైపు చైనా హెచ్చరికలు ఇస్తున్నప్పటికీ ఇది యుద్ధానికి దారితీసే అంశం ఎంత మాత్రం కాదని ఓ సీనియర్ ఆర్మీ అధికారి వ్యాఖ్యానించారు.

చైనా మళ్లీ తుస్సు...

డ్రాగన్ కంట్రీ చైనా ఆశలు ఆవిరయ్యాయి. ఆ దేశం చేపట్టిన అత్యంత భారీ రాకెట్ ప్రయోగం విఫలమైంది. ‘లాంగ్ మార్చ్-5 వై2’ పేరుతో ఆదివారం చేపట్టిన ప్రయోగం చైనాకు తీవ్ర నిరాశ
మిగిల్చింది. చైనా స్పేస్ ప్రోగ్రాంలో ఇది భారీ ఎదురుదెబ్బని విశ్లేషకులు చెబుతున్నారు. గతేడాది వెన్‌చాంగ్‌లోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ప్రయోగించిన లాంగ్ మార్చ్-5 ప్రయోగం
విజయవంతం కాగా తాజా ప్రయోగం విఫలం కావడం చైనా శాస్త్రవేత్తలను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఇప్పుడు కూడా అదే వేదిక నుంచి లాంగ్ మార్చ్-5వై2ను ప్రయోగించినా భారీ ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశ పెట్టడంలో అది విఫలమైంది. లాంగ్ మార్చ్-5వై2 రాకెట్ బరువు 879 టన్నులు. 25 టన్నుల బరువున్న ఉప గ్రహాన్ని కక్ష్యలో పెట్టే సామర్థ్యం దీని సొంతం. అయితే తాజా ప్రయోగంలో మాత్రం అది మోసుకెళ్లిన 7.5 టన్నుల బరువైన షిజియాన్-18 ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టలేకపోయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Doka La  India  China  Bhutan  

Other Articles